Begin typing your search above and press return to search.

వైశాలి 'శబ్దం'.. ఆది పినిశెట్టి స్టన్నింగ్ లుక్

కోలీవుడ్ డైరెక్టర్ అరివళగన్, టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన వైశాలి మూవీ అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Dec 2023 7:22 AM GMT
వైశాలి శబ్దం.. ఆది పినిశెట్టి స్టన్నింగ్ లుక్
X

కోలీవుడ్ డైరెక్టర్ అరివళగన్, టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన వైశాలి మూవీ అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈరం పేరుతో 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన పాటలు అప్పట్లో ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే తమన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


అయితే మళ్లీ 14 ఏళ్ల తర్వాత.. ఈ సూపర్ ట్రియోలో శబ్ధంగా మరో సినిమా రాబోతుంది. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ క్ర‌మంలోనే మూవీ నుండి చిత్ర‌ యూనిట్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

మ‌రోవైపు ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి లైలా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్న వచ్చిన‌ లైలా.. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల కార్తీ హీరోగా నటించిన సర్దార్‌ మూవీలో ముఖ్యపాత్రలో మెరిశారు. ఇప్పుడు వైశాలి కాంబోలో వ‌స్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు.

ఇటీవలే ఈ సినిమాలోని లైలాను పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. శబ్దం సినిమాలో ఆమె పాత్ర అందరిని సర్ప్రైజ్ చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఆమె వరుస ఆఫర్స తో బిజీగా కానుందని చెప్పారు. 7G ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 2024లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.