Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇలా..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో ఒక కంటెస్టెంట్ అలా 24 గంటల్లోనే ఎలిమినేట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 4:49 AM GMT
బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి ఇలా..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు ఊహించని సంఘటన జరిగింది. ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో ఒక కంటెస్టెంట్ అలా 24 గంటల్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఆడియన్స్ ని ఆకట్టుకునే క్రమంలో కొత్త కొత్త ట్విస్టులు ఇస్తుంటాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన ఒక రోజు లోనే ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు. ఐతే ఆడియన్స్ నుంచి విపరీతమైన ట్రోల్స్ రావడంతో మళ్లీ వెంటనే ఆమెను హౌస్ లోకి తీసుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇది జరిగింది. ఐతే ఇది జరిగింది తెలుగు బిగ్ బాస్ లో కాదు తమిళ్ బిగ్ బాస్ లో జరిగింది.

బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ ను కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. మొన్నటిదాకా కమల్ హాసన్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తమిళ్ ఎనిమిదవ సీజన్ కమల్ చేయడం కుదరక విజయ్ సేతుపతికి ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ తమిళ్ కోసం విజయ్ సేతుపతి భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఈ సీజన్ లో బిగ్ బాస్ ఒక కొత్త టాస్క్ ఇంట్రడ్యూస్ చేశాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకరోజులోనే ఒక కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ లాస్ట్ సండే మొదలైంది. ఐతే 24 గంటల్లోనే సచిన నమదాస్ ని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్ లో హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ఒక రోజులోనే ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పగా కంటెస్టెంట్స్ అంతా కలిసి సచిన నమదాస్ ను ఎలిమినేట్ చేశారు. ఐతే 24 గంటల్లో ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆడియన్స్ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆమె కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ నడిపించారు.

సోషల్ మీడియా ట్రెండ్స్ వల్ల దారికి వచ్చిన బిగ్ బాస్ టీం మళ్లీ సచిన నమిదాస్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి రీసెంట్ మూవీ మహారాజ లో సచిన నమిదాస్ నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ కి కూతురిగా నటించిన సచిన విషయంలో ఇది ప్లానెడ్ గా చేశారా లేదా అలా జరిగిందా తెలియదు కానీ ఆమెకు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన సపోర్ట్ పెరిగింది.