సారా టెండూల్కర్‌పై సచిన్ పెట్టిన బాధ్యత
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అక్టోబర్‌లో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది.
By: Tupaki Desk | 5 Dec 2024 2:45 AM GMTసచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ తన లాభాపేక్షలేని సంస్థకు కుమార్తె సారాను డైరెక్టర్‌గా నియమించినట్లు బుధవారం తెలిపారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అక్టోబర్‌లో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంతలోనే శుభవార్త చెప్పారు సచిన్.
నా కుమార్తె సారా టెండూల్కర్ ఎస్.టి.ఎఫ్ ఇండియాలో డైరెక్టర్‌గా చేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. అని టెండూల్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో సారా పిల్లలతో ఉన్న ఫోటోలను షేర్ చేసారు. అక్టోబర్‌లో 27 ఏళ్లు నిండిన సారా టెండూల్కర్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్ నుండి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య ద్వారా భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు``అని ఆమె తండ్రి చెప్పారు.
ఈ సంవత్సరం దీపావళిని సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ బృందంతో సెలబ్రేట్ చేసుకున్నారు.. దిగ్గజ క్రికెటర్ , అతని భార్య, శిశువైద్యురాలు, పరోపకారి అయిన అంజలి టెండూల్కర్ సెప్టెంబర్ 2019లో సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది పిల్లలకు మంచి అవకాశాలను అందించడానికి పని చేస్తుంది. అంజలి టెండూల్కర్ కూడా NGO లో డైరెక్టర్. ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసిన సారా టెండూల్కర్ ఇంటర్నెట్‌లో భారీ అభిమానులను కలిగి ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.