48 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని పెళ్లాడిన 22ఏళ్ల బ్యూటీ
ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెబ్‌లో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 16 Feb 2025 2:30 AM GMTఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పెళ్లి గురించి పోస్ట్ చేసారు. అతడు అందించిన వివరాల ప్రకారం.. దుబాయ్- బుర్జ్ ఖలీఫాలో 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను అతడు వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తగా, హిందీ చిత్రాల నటుడిగా సాహిల్ పాపులర్ పర్సనాలిటీ. సాహిల్ - మిలేనా జంట క్రిస్టియన్ స్టైల్‌లో పెళ్లాడారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వెబ్‌లో వైరల్ అవుతున్నాయి.
సాహిల్ ఖాన్ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అని రాసాడు. అతడు పలు బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించాడు. స్టైల్, ఎక్స్‌క్యూస్ మీ, అలాడిన్, రామా: ది సేవియర్ ఇన్ వంటి బాలీవుడ్ చిత్రాలలో అతడు నటించాడు. బుర్జ్ ఖలీఫా వద్ద గ్రాండ్ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెబ్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ వివాహ వేడుకలు 9 ఫిబ్రవరి 2025న జరిగాయి. ఇప్పటికి దీనిని అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు.
సాహిల్ ఖాన్ - మిలేనా అలెగ్జాండ్రా బుర్జ్ ఖలీఫా ముందు పోజులిచ్చిన ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. పెళ్లి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ వధువు భారీ వెడ్డింగ్ కేక్ ముందు పోజులిచ్చింది.''ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను'' అని సాహిల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన వివరాల్ని, ఫోటోలను షేర్ చేసారు.