Begin typing your search above and press return to search.

అదిరిపోయే గిఫ్ట్ అందుకున్న రావిపూడి.. ఎందుకంటే..

ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడికి నిర్మాతగా సాహు గారపాటి ఖరీదైన టయోటా వెల్ ఫైర్ గిఫ్ట్ గా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:32 AM GMT
అదిరిపోయే గిఫ్ట్ అందుకున్న రావిపూడి.. ఎందుకంటే..
X

టాలీవుడ్ లో కమర్షియల్ స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెనకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగానే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా బిజీలోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడికి నిర్మాతగా సాహు గారపాటి ఖరీదైన టయోటా వెల్ ఫైర్ గిఫ్ట్ గా ఇచ్చారు. ‘భగవంత్ కేసరి’ సినిమాని సాహు గారపాటి నిర్మించారు. భారీ భగవంత్ కేసరి సినిమాతో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చారు. దీని తర్వాత సాహు గారపాటితో మరో సినిమా చేయడానికి కూడా అనిల్ రావిపూడి కమిట్ అయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మరో ప్రాజెక్ట్ ని అనిల్ రావిపూడి సాహుతోనే చేయబోతున్నారు.

‘భగవంత్ కేసరి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇవ్వడంతో కృతజ్ఞతగా నిర్మాత సాహు గారపాటి అనిల్ రావిపూడికి సుమారు 1.50 కోట్ల విలువ చేసే కారుని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి విశ్వక్ సేన్ తో ‘లైలా’ మూవీ నిర్మిస్తున్నారు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తోనే సాహు గారపాటి చేస్తున్నారు. వీటి తర్వాత అనిల్ రావిపూడితో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలకృష్ణతో ఒక సినిమా చేయడానికి ‘భగవంత్ కేసరి’ తర్వాత కమిట్ అయ్యాడు.

మరల వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందా లేదంటే వేరే హీరోతో అనిల్ రావిపూడి మూవీ ప్లాన్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక దిల్ రాజు బ్యానర్ లో చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ క్రైమ్ కామెడీ కథాంశంతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.