Begin typing your search above and press return to search.

రాసిపెట్టుకోండి ఆ సినిమా మెగా బ్లాక్ బస్టర్ పక్కా..!

నెక్స్ట్ అనిల్, చిరు కాంబో సినిమా త్రిపుల్ హ్యాట్రిక్ ఇస్తుందా.. ప్రొడ్యూసర్ గా చాలా తక్కువ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడం పట్ల మీ స్పందన ఏంటని సాహు గారపాటిని అడిగితే.. రాసి పెట్టుకోండి ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:45 AM GMT
రాసిపెట్టుకోండి ఆ సినిమా మెగా బ్లాక్ బస్టర్ పక్కా..!
X

షైన్ స్క్రీన్ బ్యానర్ లో అభిరుచి గల సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా తన మార్క్ చూపిస్తున్నారు సాహు గారపాటి. ప్రస్తుతం ఆయన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రామ్ నారాయణ డైరెక్ట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా సాంగ్ రిలీజైంది. ఈ ప్రెస్ మీట్ లో సాహు గారపాటి తనకు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటన్నది చెప్పారు.

డైరెక్టర్ కథ చెప్పగానే దీన్ని నలుగురు హీరోల దగ్గరకు తీసుకెళ్లానని వాళ్లెవరు లేడీ గెటప్ వేయడానికి ఇష్టం లేక సినిమా కాదన్నారని అన్నారు సాహు గారపాటి. ఐతే డైరెక్టర్ రామ్ నారాయణ విశ్వక్ సేన్ పేరు చెబితే అతనైతే అసలు ఒప్పుకోడని చెప్పాగా ఒకసారి ట్రై చేస్తే పోలా అనుకుని విశ్వక్ కి కథ చెప్పగానే ఓకే చేశాడు. ఐతే ఈ ప్రెస్ మీట్ లోనే నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబో సినిమా గురించి కూడా హింట్ ఇచ్చారు నిర్మాత సాహు గారపాటి.

నెక్స్ట్ అనిల్, చిరు కాంబో సినిమా త్రిపుల్ హ్యాట్రిక్ ఇస్తుందా.. ప్రొడ్యూసర్ గా చాలా తక్కువ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడం పట్ల మీ స్పందన ఏంటని సాహు గారపాటిని అడిగితే.. రాసి పెట్టుకోండి ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని అన్నారు. అనిల్ రావిపూడి ఆల్రెడీ 8 వరుస హిట్లతో అదరగొట్టేస్తున్నాడు. చిరంజీవితో సినిమా కూడా అదిరిపోయేలా ఉంటుందని ఆ సినిమా నిర్మాత సాహు చెప్పారు.

ఐతే ఓ పక్క అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎక్కడ రివీల్ చేయకూడదు అనుకుంటున్నాడు. అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కచ్చితంగా ఈ కాంబో సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అనిల్ మార్క్ ఎంటర్టైమెంట్ మూవీగా వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సీనియర్ స్టార్స్ వెంకటేష్, బాలకృష్ణతో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరంజీవితో సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక కింగ్ నాగార్జునతో కూడా సినిమా చేస్తే సీనియర్ స్టార్స్ అందరితో చేసిన ఈ తరం దర్శకుడిగా రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉంటుంది.