Begin typing your search above and press return to search.

ఈయ‌న కూడా ఫ్యామిలీ ప్యాక్ లు లేపేస్తాడా!

అంటే మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్ అదే టైప్ అన్నాడు. హీరో కాక ముందు తాను 130 కిలోల బ‌రువు ఉండేవాడిన‌న్నారు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 9:30 PM GMT
ఈయ‌న కూడా ఫ్యామిలీ ప్యాక్ లు లేపేస్తాడా!
X

ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఉన్న ప‌ళంగా లేపేసిన చ‌రిత్ర ఎవ‌రికైనా ఉందా? అంటే ముందుగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేరు చెబుతారు. తార‌క్ ఎలా తినేవారో? త‌న తిండి గురించి తానే స్వ‌యంగా ఓ సంద‌ర్భంలో వెల్ల డించారు. కొన్ని ద‌శాబ్దాల క్రింద‌కు వెళ్తే హైద‌రాబాద్ బిర్యానీ తిన‌డంలో తానో స్పెష‌ల్ గా భావించేవారు. నెయ్యిలో, వెన్న‌లో ఇడ్లీలు ముంచుకుని తిన‌డం? ఇలా ఒక‌టేంటి తార‌క్ ఒక‌ప్పుడు పుష్టిగా భుజించేవారు.

అయితే ఇప్పుడా అల‌వాటును పూర్తిగా మానుకున్నారు. ఇప్పుడు వెయిట్ ఎలా త‌గ్గాలి? అంటే తార‌క్ ని టిప్ అడిగితే చాలు. సింపుల్ గా తిన‌డం త‌గ్గించుకుంటే చాలు బ‌రువు దానంత‌ట‌దే త‌గ్గిపోతుంద‌ని స‌ల‌హా ఇస్తుంటారు. ఇక తార‌క్ ఇంటికొచ్చిన అతిధులుగా తానే స్వ‌యంగా బిర్యానీ చేసి వ‌డ్డిస్తారు. ఆవిష‌యంలో క‌ల్యాణ్ రామ్ స‌హా వెళ్లే అతిధు లంతా ఎంతో ల‌క్కీ. సండే వ‌చ్చిందంటే క‌ళ్యాణ్ రామ్ తార‌క్ ఇంట్లోనే బిర్యానీ రుచులు ఆస్వాదిస్తారు.

ఆ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ సైతం మంచి భోజ‌న ప్రియుడుగా చెబుతుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగ‌ద‌నే టైపు. అత‌డి మెనులో రోజూ అన్ని ర‌కాల వెజ్-నాన్ వెజ్ వంట‌కాలు ఉండాల్సిందే. వీళ్లంద‌ర్నీ ప‌క్క‌న‌బెడితే తార‌క్ లా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ప్యాకెట్ లు లేపేసే హీరో ఇంకేవరైనా ఉన్నారా? అంటే మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్ అదే టైప్ అన్నాడు. హీరో కాక ముందు తాను 130 కిలోల బ‌రువు ఉండేవాడిన‌న్నారు.

అలా ఎందుక‌య్యారంటే? ప్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్క‌డే తినేస్తే అలాగే అవుతామ‌ని స‌మాధానం ఇచ్చాడు. ఈ విష‌యం ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా సాయితేజ్ రివీల్ చేసాడు. అయితే సాయితేజ్ ఇండస్ట్రీకి వ‌చ్చే ముందే స్లిమ్ లుక్ మారిపోయాడు. పూర్తిగా హీరోయిక్ లుక్ లో ట్రాన్స‌ప‌ర్ అయిన త‌ర్వాతే మ్యాక‌ప్ వేసుకున్నాడు.