వరద బాధితులకు మెగా మేనల్లుడు 25 లక్షలు సహాయం!
వరద బాధితులకు అండగా మెగా మేనల్లుడు నిలబడ్డాడు. తన వంతు సాయి దుర్గ తేజ్ రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు.
By: Tupaki Desk | 5 Sept 2024 5:08 AMవరద బాధితులకు అండగా మెగా మేనల్లుడు నిలబడ్డాడు. తన వంతు సాయి దుర్గ తేజ్ రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నట్టు సాయి తేజ్ ప్రకటించారు. దీంతోపాటు విజయవాడలో తాను, మెగా అభిమానులు, జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షల విరాళం అందిస్తు న్నానని తెలిపారు.
విపత్తు కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 6 కోట్లు, చిరంజీవి కోటి, రామ్ చరణ్ కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కోటి విరాళం రెండు రాష్ట్రల సీఎం సహాయ నిధికి ప్రకటించారు. బన్నీ అంతకు ముందు కేరళ వయనాడ్ ఘటనపై కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
25 లక్షలు అక్కడ బాధితులకు అందించారు. తెలుగు రాష్ట్రాల ఘటనపై ఇంకా విరాళాలు వెల్లువ కొనసా గుతుంది. విపత్తుల సమయంలో మేము ముందుటామని ఇండస్ట్రీ ముక్త కంఠగా ముందుకు రావడంతో ఎంతో గొప్ప విషయం. గతంలోనూ చాలా విపత్తుల సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసారు.
విరాళాలు ప్రకటించడంలో సౌత్ నుంచి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎప్పుడూ ముందుంటాయి. సొంత రాష్ట్రాల ప్రజల కోసం ఎప్పుడూ అండగా నిలబడతాయి ఆ రెండు పరిశ్రమలు. కొంత తెలుగు హీరోలు ఇతర రాష్ట్రాల విపత్తుల సమయంలోనూ తోచిన సహాయం చేస్తుంటారు.