SDT 18 మెగా అనౌన్స్‌మెంట్ లోడింగ్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇటీవల నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 8 Dec 2024 3:00 PM GMTసుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ఇటీవల నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత బ్రో అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత అతడి నుంచి మరో సినిమా రాలేదు. చాలా కాలంగా స్క్రిప్టులు వింటూ అవసరమైన విరామం తీసుకున్నాడు. తన కెరీర్ 18వ సినిమాని సైలెంట్ గా పూర్తి చేసాడు. తాజా సమాచారం మేరకు.... తన తదుపరి చిత్రం కోసం నూతన దర్శకుడు రోహిత్ కెపితో చేతులు కలిపాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక.
మేకర్స్ తాజాగా ఫ్యాన్స్ ని ఊరించే అప్‌డేట్‌ను వెల్లడించారు. SDT 18 అప్ డేట్ ని డిసెంబర్ 12న చెబుతామని ఊరించారు. సోమవారం ఉదయం 11:07 గంటలకు `మెగా మాసివ్` అప్‌డేట్‌ను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొంటారని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే కాస్త వేచి చూడాల్సిందే.
ఈ చిత్రంలో శ్రీకాంత్, జగపతిబాబు, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. వెట్రి పళనిసామి లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కె. నిరంజన్ రెడ్డి - చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ హై-ఆక్టేన్ పాన్-ఇండియన్ చిత్రం విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. పరిశ్రమలో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.