Begin typing your search above and press return to search.

సంబరాల యేటి గట్టు.. హొలీ సర్ ప్రైజ్!

సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే ఇదివరకెన్నడూ కనిపించని రూట్‌లో రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   14 March 2025 11:36 AM IST
సంబరాల యేటి గట్టు.. హొలీ సర్ ప్రైజ్!
X

మెగా ఫ్యామిలీ నుంచి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ సిద్ధమైంది. విరూపాక్ష విజయంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సాయి తేజ్, ఈసారి మరింత భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ KP దర్శకత్వంలో సంబరాల యేటి గట్టు "SYG" పేరుతో సరికొత్త సినిమా రూపొందుటజోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్, RKD స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి చేపట్టారు.


సాయిధరమ్ తేజ్ కెరీర్‌లోనే ఇదివరకెన్నడూ కనిపించని రూట్‌లో రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ఫస్ట్ లుక్‌లోనే మెగా హీరో మాస్ లుక్‌తో అదిరిపోయే హవా క్రియేట్ చేశాడు. మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథ 1947కి ముందు నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించనుందనే టాక్ వినిపిస్తోంది. చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని కీలక సంఘటనల చుట్టూ కథ తిరిగేలా ఉందనే ఫీలింగ్ వస్తోంది.

సాయిధరమ్ తేజ్ గత చిత్రాల కంటే, ఈసారి విభిన్నమైన కథాంశంతో రానున్నట్లు అర్ధమవుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ విభజన కాలంలో నడిచిన కొన్ని అసలైన సంఘటనల చుట్టూ అల్లుకున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు హొలీ సందర్భంగా స్పెషల్ అప్డేట్ పోస్టర్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌లో మొత్తం బృందం చేతులు పైకెత్తి గర్జించిన విధానం సినిమాకు సంబంధించిన సీరియస్ టోన్‌ను తెలియజేస్తోంది.

అయితే ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సాయి తేజ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది. హనుమాన్ మూవీని బ్లాక్‌బస్టర్‌గా నిలిపిన నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కథ, టేకింగ్, మేకింగ్ అన్నీ కేరాఫ్ ఎడ్రస్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాల్లో ఇలాంటి కాంటెంట్ ఉన్న కథ లేదట. విభజన నేపథ్యంతో ఇంత రాచరికపు, సామాజిక సంఘర్షణ నేపథ్యంలో చిత్రం రావడం ఇదే మొదటిసారి. సినిమా కథాంశం ఏమిటో, అసలు ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందనే విషయాలు ట్రైలర్ ద్వారా తెలుస్తాయి. కానీ ఇప్పటికే వచ్చిన పోస్టర్ ఒక్కటి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ సమ్మర్ తరువాత వచ్చే అవకాశం ఉంది.