46వ ఏట పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో..!
ఇండస్ట్రీలో రెండో పెళ్లి, లేటు వయసు పెళ్లి అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మరో లేటు వయసు పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
By: Tupaki Desk | 10 Nov 2024 9:40 AM GMTసినిమా హీరోలు ఇతరులతో పోల్చితే అయిదు పదేళ్లు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. కొందరు పెళ్లికి పూర్తిగా దూరంగా ఉంటే ఎక్కువ శాతం మంది లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే మూడు పదుల వయసు లోపు పెళ్లి పీటలు ఎక్కిన వారు ఉన్నారు. ఇండస్ట్రీలో రెండో పెళ్లి, లేటు వయసు పెళ్లి అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మరో లేటు వయసు పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశం అవుతున్నాయి. నువ్వే కావాలి సినిమాలో తరుణ్ తో పాటు మరో హీరోగా సాయి కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. గాయని సుశీలమ్మ గారి కుటుంబంకు చెందిన సాయి కిరణ్ కి ఇండస్ట్రీలో ఈజీగానే ఎంట్రీ దక్కింది.
నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ కి ఆ సినిమా సూపర్ హిట్ అయినా, హిట్ క్రెడిట్ మాత్రం ఆశించినంతగా రాలేదు. అయినా ఇండస్ట్రీలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌తో బాగానే వచ్చాయి. తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సినిమా కెరీర్ ను సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న సాయి కిరణ్ ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలుగా బుల్లితెరపై సందడి చేస్తున్న ఈయన అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపించడం ద్వారా ఈ జనరేషన్ వారికీ సుపరిచితుడు. అలాంటి సాయి కిరణ్ కొత్త జర్నీ మొదలు పెట్టారు. తన కో ఆర్టిస్టు అయిన స్రవంతి తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యాడు.
సాయి కిరణ్ కి పదిహేను ఏళ్ల క్రితం పెళ్లి అయి ఒక బిడ్డ కూడా ఉన్నాడనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాతే స్రవంతితో పెళ్లికి సిద్దం అయ్యి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీరియల్స్‌లోనే కాకుండా సాయి కిరణ్ చాలా కాలంగా సోషల్ మీడియాలో ఫన్నీ రీల్స్ చేయడంతో పాటు, ఆలోచింపజేసే రీల్స్ చేయడం ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. కోయిలమ్మ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న సాయి కిరణ్ తన వ్యక్తిగత జీవితంలో 46వ ఏట స్రవంతితో ముందడుగు వేసేందుకు సిద్ధం అయ్యాడు.
తెలుగులో సాయి కిరణ్ నువ్వే కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమించు, మనసుంటే చాలు, ఎంత బాగుందో సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ సినిమాల్లో ఏది పెద్దగా ఆడక పోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలను చేయడం మొదలు పెట్టాడు. అలా మంచి ఆఫర్లే వస్తున్న సమయంలోనే సీరియల్స్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. గత కొంత కాలంగా పూర్తిగా సీరియల్స్‌తో బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన సంప్రదింపులు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది.