Begin typing your search above and press return to search.

క‌ష్టం తెలిసిన హీరోయిన్ అందుకే ఆ వ్య‌త్యాసం ప‌ట్టిందిలా!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్-సౌత్ సినిమా మ‌ధ్య వ‌త్యాసం చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. 'హిందీ లో ప్రీ ప్రొడక్ష‌న్ ఎక్కువ రోజుల పాటు జ‌రుగుతుంది.

By:  Tupaki Desk   |   8 Nov 2024 8:30 PM GMT
క‌ష్టం తెలిసిన హీరోయిన్ అందుకే ఆ వ్య‌త్యాసం  ప‌ట్టిందిలా!
X

ట్యాలెంటెడ్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి ఖాతాలో 'అమ‌ర‌న్' తో మ‌రో స‌క్సెస్ ప‌డింది. అమ్మ‌డు నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో మ‌రోసారి అదర‌గొట్టింది. మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ భార్య పాత్ర‌లో త‌న‌ద‌మైన మార్క్ న‌ట‌న‌తో సౌత్ ఆడియ‌న్స్ ని అల‌రించింది. సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో మరో గొప్ప చిత్రంగా అమ‌ర‌న్ ని చెప్పొచ్చు. త్వ‌ర‌లో రామాయ‌ణ్ సినిమాతో పాన్ ఇండియాలోనూ సంచ‌ల‌నం అవ్వ‌డానికి రెడీ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి క్రేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

బాలీవుడ్ లో అమ్మ‌డికిదే తొలి సినిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్-సౌత్ సినిమా మ‌ధ్య వ‌త్యాసం చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. 'హిందీ లో ప్రీ ప్రొడక్ష‌న్ ఎక్కువ రోజుల పాటు జ‌రుగుతుంది. షూటింగ్ చేసే ట‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ సౌత్ లో ఇంకొంచెం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రింత మెరుగు ప‌ర‌చ‌డానికి ఇక్క‌డ అవ‌కాశం ఉంటుంది. నేను ఇంప్రూవైషన్ గురించి చెప్పాలంటే చాలా విష‌యాలున్నాయి.

అందుకే చెప్ప‌డం లేదు. అలా చెప్పాలంటే కొంచె భ‌యం కూడా వేస్తుంది. రెండు ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఆ తేడాను స్ప‌ష్టంగా గ‌మ‌నించాను. అలాగే మాకు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. ప్ర‌తీ సినిమాకి ఆ సంఖ్య పెరుగుతుంటుంది. కానీ బాలీవుడ్ లో ఇచ్చేంత పారితోషికం అక్క‌డ వాళ్లు తీసుకోలేరు. ఒక సినిమాకి ప‌నిచేసిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు త‌దుప‌రి సినిమాకి కూడా కొన‌సాగుతుంటారు. ప్రొడ‌క్ట్ విష‌యంలో ద‌ర్శ‌కులు ఎంతో కేరింగ్ గా ఉంటారు.

అందుకు అన్ని ర‌కాల అర్హ‌త‌లు ఉన్న వారినే తీసుకుంటారు. కానీ సౌత్ లో ఇలా ఉందా? లేదా? అన్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ ప్ర‌తిభావంతులు చాలా మంది ఉన్నారు. కొంత‌మంది క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తారు. ఒక్కోసారి వారికి స‌రైన గుర్తింపు కూడా ద‌క్క‌దు. అది నేను చూసిన మ‌రో వ్య‌త్యాసం' అంది. సాయిపల్ల‌వి టీవీ స్టేజ్ షోల నుంచి హీరోయిన్ అయింది. క‌ష్టం ఎలా ఉంటుంది? అన్న‌ది ఆమెకి బాగా తెలుసు. ఎలాంటి ఇండ‌స్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కెరీర్ ప్రారంభించి నేడు బాలీవుడ్ స్థాయికి ఎదిగింది.