ప్రభాస్ ఛాన్స్ ఆ ఇద్దరిలో ఎవరికి..?
రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.
By: Tupaki Desk | 2 Feb 2025 4:55 PM GMTరెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫౌజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. సీతారామం తర్వాత హను రాఘవపూడి ఎవరితో సినిమా చేస్తాడా అని ఆడియన్స్ అంతా ఎగ్జైట్ అవ్వగా ఏకంగా బాక్సాఫీస్ బాహుబలితోనే సినిమా లాక్ చేసుకుని షాక్ ఇచ్చాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఐతే ఈ సినిమాలో ఆల్రెడీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కూడా అవసరం ఉంటుందని తెలుస్తుంది. ఫౌజీ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఆ ఎపిసోడ్స్ లో ఒక కథానాయిక అవసరం అని తెలుస్తుంది. ఐతే ఆ ఛాన్స్ ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఫౌజీ లో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంటారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.
సాయి పల్లవితో ఆల్రెడీ హను రాఘవపూడి పడి పడి లేచే మనసు సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా హను మార్క్ మూవీగా యువతని ఆకట్టుకుంది. ఐతే హను ఇప్పుడు ప్రభాస్ కోసం సాయి పల్లవిని తీసుకుంటాడని తెలుస్తుంది. ఐతే సాయి పల్లవి అంత ఈజీగా ఒప్పుకునే ఛాన్స్ లేదు. క్యారెక్టర్ నచ్చాలి అది సినిమాలో వెయిటేజ్ ఉండేలా చూడాలి. ఒకవేళ సాయి పల్లవి చేయనని అంటే ఆ రోల్ కి మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటారని తెలుస్తుంది.
సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో మెప్పించిన మృణాల్ మళ్లీ హను తో సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి అది కూడా ప్రభాస్ సినిమా అంటే అమ్మడు నో చెప్పే ఛాన్స్ లేదు. సో రెబల్ స్టార్ సినిమాలో రెండో హీరోయిన్ గా కూడా సిద్ధం అనేస్తారు. మరి ఈ ఇద్దరిలో ఫౌజీ ఛాన్స్ ఎవరికి అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఫౌజీతో పాటు ప్రభాస్ మరోపక్క మారుతి డైరెక్షన్ లో స్పిరిట్ కూడా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నా మేకర్స్ సైలెంట్ గా ఉన్నారు.