గ్లామర్ పాత్రలు చేయకుండానే పాన్ ఇండియాలో!
పాన్ ఇండియా సినిమా అంటే ఈ రూల్స్ ఇంకా కఠినంగా ఉంటాయి. కానీ సాయి పల్లవి ముందు ఈ రూల్స్ ఏవి పనిచేయవు.
By: Tupaki Desk | 26 Nov 2024 5:36 AM GMTపాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ అవకాశం అంటే అంత వీజీ కాదు. మేకర్స్ చాలా విషయాలు పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తుంటారు. ఇక్కడ ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు. మార్కెట్ పరంగా ఎంత వరకూ రాణించగలదు? అన్నది కూడా ఆలోచిస్తారు. అంతకు ముందు పాన్ ఇండియా సినిమాలు ఏవైనా చేసిందా? ప్రేక్షకాభిమానుల్లో ఆమెకు బలం..బలహీనతలు? గ్లామర్ ఎలివేషన్ పరంగా ఏవైనా అడ్డు పుల్ల వేస్తుందా? దర్శకులకు పూర్తి సహకారం అందిస్తుందా? ఇలా చాలా విషయాలు ఆలోచించాకే సినిమాలోనైనా ఛాన్స్ ఇస్తారు.
పాన్ ఇండియా సినిమా అంటే ఈ రూల్స్ ఇంకా కఠినంగా ఉంటాయి. కానీ సాయి పల్లవి ముందు ఈ రూల్స్ ఏవి పనిచేయవు. తాను పెట్టిందే రూల్ అన్నట్లుగా అమ్మడు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది. గ్లామర్ పాత్రలు చేయదు. ఎక్స్ పోజింగ్ కి ఆమడ దూరంలో ఉంటుంది. స్కిన్ షో..కనీసం క్లీవేజ్ కూడా ఉండదు. కేవలం నటనతోనే మెప్పిస్తాను తప్ప అలాంటి వాటికి నో వే అనేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది.
వీటిలో అవకాశాలు ఎలా అంటే కేవలం తన ప్రతిభతోనే దక్కించుకుందని చెప్పొచ్చు. యువ సామ్రాట్ నాగచైతన్య సరసన `తండేల్` లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోల్లో బుజ్జి తల్లి ఏ రేంజ్ పెర్పార్మెన్స్ ఇచ్చిందో అంచనా వేయోచ్చు. బాక్సాఫీస్ క్వీన్ అంటూ నాగచైతన్యనే కీర్తించాడు. అంతకు మించి సాయి పల్లవి సాధించాల్సింది ఇంకేముంటుంది. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరససన సీత పాత్ర పోషిస్తుంది.
ఇద్దరు జంటగా `రామాయణ్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయిందని లీకైన చిత్రాలు చూస్తేనే అర్దమవుతుంది. సీత ఆహార్యంలో ఎంతో అందంగా ఉంది. అధికారిక ప్రచార చిత్రాలోస్తే ఆ వేవ్ మాటలకు అందదు. ఆర్సీ 17లోనూ సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. అంతేనా సాయిప్లలవితో నటించడానికి హీరోలే పోటీ పడుతున్నారు. ఆమెతో డాన్సులు చేయాలని తారక్, బన్నీ లాంటి ఫస్ట్ క్లాస్ డాన్సర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలా హీరోలంతా సాయి పల్లవి జపం చేయడంతో? ఆమె రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది