నెమలిని గుర్తు చేసే సాయిపల్లవి!
ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన హైలెస్సో హైలెస్సా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రేంజ్ లో అందరినీ మెప్పిస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 7:25 AM GMTసాయి పల్లవి.. ఆమెకు ఉన్న క్రేజే వేరు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న అమ్మడు నటించిన సినిమా వస్తుందంటే చాలు.. అంతా భారీ హోప్స్ పెట్టుకుంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి కూడా తమ చిత్రాలతో అలరిస్తుంటారు. రీసెంట్ గా అమరన్ మూవీతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సాయి పల్లవి. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య మేల్ లీడ్ లో నటిస్తున్న ఆ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అన్ని పనులు పూర్తి చేసుకున్న తండేల్.. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజ్ అవ్వగా.. అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లోనే ఉన్నాయి.
ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన హైలెస్సో హైలెస్సా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రేంజ్ లో అందరినీ మెప్పిస్తోంది. మ్యూజిక్ లవర్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సాంగ్ చాలా బాగుందని చెబుతున్నారు. అదే సమయంలో సాయి పల్లవి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యామని.. ఒక్కో మూవ్మెంట్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు.
ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నామని, ఆమె డ్యాన్స్ నెమలిని గుర్తు చేస్తుందని కొనియాడుతున్నారు. అదే సమయంలో తాజాగా నిర్మాత బన్నీ వాసు క్రేజీ కామెంట్స్ చేశారు. హైలెస్సో సాంగ్ లో దాదాపు నిమిషం పాటు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేస్తుందని తెలిపారు. అప్పుడు కచ్చితంగా అందరికీ నెమలే గుర్తుకు వస్తుందని చెప్పారు.
లిరికిల్ వీడియోలో తక్కువే చూపించామని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఐ ఫీస్ట్ పక్కా అని చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై నెమలి నాట్యం కోసం ఈగర్ గా వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు. నార్మల్ గా ఏ పాటకు ఆమె డ్యాన్స్ చేసినా.. మయూరి నాట్యం చేసినట్టు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు హైలెస్సో హైలెస్సా సాంగ్ తో సాయి పల్లవి ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.