Begin typing your search above and press return to search.

కుర‌చ దుస్తుల‌కు సాయిప‌ల్లవి అందుకే నో బెబుతుంది!

నేడు బాక్సాఫీస్ క్వీన్ గా తెలు గింట నీరాజ‌నాలు అందుకుంటుంది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 5:30 AM GMT
కుర‌చ దుస్తుల‌కు సాయిప‌ల్లవి అందుకే నో బెబుతుంది!
X

సాయి ప‌ల్ల‌వి క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తాను ఎంపిక చేసుకున్న పాత్ర‌లే అంత‌టి గుర్తింపును..అభిమా నాన్ని తీసుకొచ్చాయి. హీరోయిన్ గా ఏ భామ‌కు లేనంత క్రేజ్ సాయిప‌ల్ల‌వికి ఉంది. నేడు బాక్సాఫీస్ క్వీన్ గా తెలు గింట నీరాజ‌నాలు అందుకుంటుంది. బాలీవుడ్ లో ప్ర‌తిష్టాత్మ‌క 'రామాయ‌ణం' చిత్రంలోనూ న‌టించే అరుదైన అవ‌కాశం కేవలం సాయి ప‌ల్ల‌వికి మాత్ర‌మే వ‌రించింది. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా? సీత‌మ్మ పాత్ర ప‌ల్ల‌విని వెతుక్కుం టూ మ‌రీ వ‌చ్చింది.

ఆ పాత్ర‌కు అన్ని ర‌కాలుగా సాయి ప‌ల్ల‌వి అర్హురాలు. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌ల్ల‌వి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. బోల్డ్ రోల్స్ అనేవి అమ్మ‌డికి తెలియ‌నే తెలియ‌వు. ఇలా కొన్ని విలువ‌ల‌తో సినిమాలు చేస్తుంది కాబ‌ట్టే సాయిప‌ల్ల‌వి అంటే ప్ర‌త్యేకమైన అభిమానం క‌నిపిస్తుంది. మ‌రి అస‌లు సాయి ప‌ల్ల‌వి కుర‌చ దుస్తులు ఎందుకు వేసుకుని న‌టించ‌దు? అన్న సంగ‌తి మాత్రం ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. తొలిసారి ఓ ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యాన్ని అమ్మ‌డు లీక్ చేసింది.

తాను న‌టే అయినా పొట్టి బ‌ట్ట‌లు వేసుకోవ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌నంది. ఆ దుస్తులు వేసుకుని న‌టిస్తు న్న‌ప్పుడు ఎదుట వారు విమ‌ర్శించ‌డం, అభ్యంత‌రాలు చెప్ప‌డం అన్న‌ది ఎంత మాత్రం న‌చ్చ‌దంది. ఆ విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం కంటే అలాంటి దుస్తులు వేసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని పూర్తిగా దూరంగా ఉందంది. దీనికి మ‌రో కార‌ణం కూడా చెప్పుకొచ్చింది. జార్జియాలో చ‌దువు కుంటున్న‌ప్పుడు టాంగో డాన్స్ నేర్చుకుందిట‌.

ఆడాన్స్ కోసం ఓ వైపు క‌ట్ చేసిన పొట్టి డ్రెస్ ధ‌రించిందిట‌. అది జ‌రిగి చాలా కాల‌మ‌వుతున్నా 'ప్రేమ‌మ్' రిలీజ్ అనంత‌రం ఆ వీడియో ఎవ‌రో లీక్ చేసి వైర‌ల్ చేసారుట‌. దీంతో చాలా మంది త‌న‌ని తీవ్రంగా విమ‌ర్శించారుట‌. దీంతో చాలా బాధ ప‌డిందిట‌. అప్పుడే త‌న‌కంటూ కొన్ని నియ‌మాలు విధించుకుని ముందుకెళ్తున్న‌ట్లు తెలిపింది. న‌టిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అలాంటి దుస్తుల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చింది.