Begin typing your search above and press return to search.

సాయిపల్లవి సినిమా రిలీజైన ప్రతిసారీ..

తన సినిమాలు రిలీజైనపుడల్లా ఆమెను ట్రోల్ చేస్తూ తన చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 5:30 PM GMT
సాయిపల్లవి సినిమా రిలీజైన ప్రతిసారీ..
X

మలయాళంలో కథానాయికగా తొలి చిత్రం ‘ప్రేమమ్’తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. తెలుగులో తొలి సినిమా ‘ఫిదా’తో అందరినీ ఫిదా చేసిన అమ్మాయి సాయిపల్లవి. ఆ తర్వాత కూడా మంచి మంచి పాత్రలు, సినిమాలు చేసి తన ఫాలోయింగ్‌ను పెంచుకుంది. మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంటుంది సాయిపల్లవి. అలాంటి అమ్మాయి ఆ మధ్య ‘విరాటపర్వం’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా చేసిన ఓ కామెంట్ తన మెడకు చుట్టుకుంది.

‘కశ్మీర్ ఫైల్స్‌’లో కశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి చూపించారని.. కానీ అదే సమయంలో గోవును తీసుకున్న ముస్లిం వ్యక్తిని కొట్టి చంపేయడాన్ని ఎలా సమర్థిస్తారని.. ఇండియన్ ఆర్మీకి, పాకిస్థాన్ ఆర్మీకి తేడా లేదని ఆమె ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. దీని మీద ఓ వర్గం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. తన సినిమాలు రిలీజైనపుడల్లా ఆమెను ట్రోల్ చేస్తూ తన చిత్రాలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.

ఇంతకుముందు ‘రామాయణం’ సినిమాకు సాయిపల్లవిని ఎంపిక చేయడం మీద ఈ వర్గం ట్రోల్ చేసింది. తన పాత కామెంట్స్ గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి అమ్మాయి సీతగా నటించడమేంటి అని విమర్శించారు. ఇప్పుడు సాయిపల్లవి నుంచి ‘అమరన్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌ను ప్రేమించే యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది.

ఐతే ఇండియన్ ఆర్మీని కించపరిచేలా మాట్లాడిన సాయిపల్లవిని.. ఆర్మీ ఆఫీసర్‌ను ప్రేమించే యువతి పాత్రకు ఎలా ఎంచుకుంటారంటూ ‘అమరన్’ మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి సాయిపల్లవి పాత వీడియోను మళ్లీ తిప్పతూ అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగేలా ఉంది. ఇది తన సినిమాల మీద పరోక్ష ప్రభావం చూపించేలా ఉంది. ఇదో తలనొప్పిగా మారిన నేపథ్యంలో తన వ్యాఖ్యల మీద సారీ చెప్పే పరిస్థితి వస్తుందేమో చూడాలి.