సాయి పల్లవి డ్యాన్స్.. హైలెస్సో నెక్స్ట్ లెవెల్ అంతే..!
ఈ సాంగ్ లిరికల్ వీడియోలో నెమలి నాట్యం ఆడినట్టుగా సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు.
By: Tupaki Desk | 26 Jan 2025 3:38 AM GMTప్రస్తుతం సౌత్ లో ఉన్న కథానాయికల్లో సాయి పల్లవి మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు చూపిస్తున్న అభినయంతో పాటు ఆమె చేసే డ్యాన్స్ మూమెంట్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి ఎన్నో ఏళ్లు తను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇన్నాళ్లకు వచ్చిందని చెప్పొచ్చు. ఇక సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే పాటలు హిట్టే.. డ్యాన్స్ కూడా సూపర్ హిట్టే అని ఫిక్స్ అవుతారు.
నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా తండేల్ సినిమా వస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లవ్ స్టోరీతో దేశభక్తిని కలిపి చూపిస్తున్న చందు మొండేటి సాంగ్స్ విషయంలో మాత్రం అదరగొట్టేశాడు.
ఐతే లేటెస్ట్ గా రిలీజైన హైలెస్సో హైలెస్సా సాంగ్ మాత్రం యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో నెమలి నాట్యం ఆడినట్టుగా సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. ఐతే ఈ క్రమంలో సినిమా నిర్మాత బన్నీ వాసు లిరికల్ వీడియోలో కాదు సాంగ్ లో సాయి పల్లవి నిమిషం పాటు డ్యాన్స్ వేస్తుంది. అది వేరే లెవెల్ లో ఉంటుందని అన్నారు.
సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఈ న్యూస్ విన్నప్పటి నుంచి అది ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉన్నారు. తండేల్ సినిమా చిన్నగా ఊహించని రేంజ్ లో బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 7న థియేటర్లు అన్ని హౌస్ ఫుల్స్ పడేలా సాంగ్స్ తోనే సూపర్ వైబ్ తెచ్చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీకి అది కూడా తన మార్క్ మ్యూజిక్ తో రావడం సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. మరి తండేల్ అన్ని విధాలుగా సూపర్ బజ్ క్రియేట్ చేయగా బాక్సాఫీస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.