Begin typing your search above and press return to search.

నాని రిజెక్ట్ చేసిన కథలో సాయి పల్లవి?

ఇందులో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 6:20 AM GMT
నాని రిజెక్ట్ చేసిన కథలో సాయి పల్లవి?
X

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న బ్యూటీ సాయి పల్లవి. ఈ అమ్మడు రీసెంట్ గా 'అమరన్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో 'తండేల్' మూవీ చేస్తోంది. అలాగే తమిళంలో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ అప్ లో ఉంది. అలాగే హిందీలో అమీర్ ఖాన్ తనయుడితో ఒక సినిమా చేస్తోంది. అలాగే 'రామాయాణం'లో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి చాలా సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటుందనే సంగతి అందరికి తెలిసిందే.

ఆమె కథ మొత్తం విన్న తర్వాత నచ్చితేనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి నితిన్ కి జోడీగా 'ఎల్లమ్మ' కథకి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 'బలగం' మూవీ తర్వాత వేణు 'ఎల్లమ్మ' కథ సిద్ధం చేసుకున్నారు. నానితో ఈ మూవీ చేయాలనుకున్నారు. అయితే ఏవో కారణాల వలన ఆయనతో సెట్ కాలేదు. దీంతో వేణు హీరో నితిన్ కి ఈ కథ చెప్పి ఒకే చేయించుకున్నారు.

దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. రీసెంట్ గా వేణు సాయి పల్లవిని కలిసి స్టోరీ నేరేషన్ ఇచ్చాడంట. ఈ మూవీ కథ, క్యారెక్టరైజేషన్ అంతా సాయి పల్లవికి బాగా కనెక్ట్ అయ్యిందని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ కి వెంటనే ఆమె ఒకే చెప్పేసిందంట. త్వరలో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' చేస్తున్నాడు.

అలాగే దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. వీటి తర్వాత నితిన్ ఎల్లమ్మ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అయితే సాయి పల్లవి, నితిన్ కాంబినేషన్ అంటే కచ్చితంగా ప్రేక్షకులకి కూడా కొత్తగా అనిపిస్తుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ 'ఎల్లమ్మ' మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీతో పాటు నితిన్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.