Begin typing your search above and press return to search.

ఇందుగా సాయి పల్లవి.. బ్యూటిఫుల్ ఇంట్రో చూశారా?

హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Sep 2024 8:36 AM GMT
ఇందుగా సాయి పల్లవి.. బ్యూటిఫుల్ ఇంట్రో చూశారా?
X

హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటోంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో అమరన్ మూవీ చేస్తోంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న అమరన్ లో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కుతున్న ఆ మూవీని కమల్ హాసన్ కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే అమరన్ మూవీ నుంచి హీరో శివ కార్తికేయ‌న్ లుక్‌ తోపాటు సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా సినిమాలోని ఎక్కువ పార్ట్ కాశ్మీర్ లో షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. షూటింగ్ లొకేషన్ లో సాయి పల్లవి, శివ కార్తికేయన్ దిగిన పిక్స్.. మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్‌ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సాయి పల్లవి ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. ఇందు రెబెక్కా వర్గీస్ గా నేచురల్ బ్యూటీ సినిమాలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ గా శివకార్తికేయన్ యాక్ట్ చేస్తుండగా.. ఆయన భార్యగా సాయి పల్లవి నటిస్తోంది. లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సాయి పల్లవి గ్లింప్స్.. సోష‌ల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ఫుల్ వైర‌ల్ అవుతోంది.

సాయి పల్లవి పాల్గొనే రిపబ్లిక్ డే పరేడ్‌ తో ప్రోమో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఫైల్ ఫుటేజ్ చూపించారు మేకర్స్. మేజ‌ర్ ముకుంద్ వీర మ‌ర‌ణానంత‌రం భార్య‌ ఇందు (సాయి ప‌ల్ల‌వి)కి కేంద్ర ప్ర‌భుత్వం పుర‌స్కారం అంద‌జేసే సన్నివేశాలను యాడ్ చేశారు. ముకుంద్‌, ఇందు మధ్య ప్రేమ‌, పెళ్లి, కుటుంబానికి సంబంధించిన సీన్స్ తో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

గ్లింప్స్ చూశాక.. సాయిపల్లవి ఇందు రెబెకా వర్గీస్‌ పాత్రలో జీవించేసినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. త‌న యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను కంట‌త‌డి పెట్టిస్తుంద‌నేలా కనిపిస్తోంది. శివకార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి సాయి పల్లవి ఫ్యాన్స్ కు మేకర్స్ బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీ రిలీజ్ కానున్న అమరన్ మూవీతో నేచురల్ బ్యూటీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.