Begin typing your search above and press return to search.

సాయి పల్లవితో అంటే టెన్షన్‌ : నాగ చైతన్య

రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమెజాన్ రానా దగ్గుబాటి టాక్ షో లో నాగ చైతన్య పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 12:13 PM GMT
సాయి పల్లవితో అంటే టెన్షన్‌ : నాగ చైతన్య
X

అక్కినేని నాగ చైతన్య గత వారం రోజులుగా పెళ్లి వార్తలతో మీడియాలో ఉంటున్నారు. హీరోయిన్‌ శోభిత దూళ్లిపాళతో చైతూ వివాహం వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగ చైతన్య, శోభితలు ఏకం అయ్యారు. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే. పెళ్లి జరిగిన వెంటనే శ్రీశైలం మల్లన్న దర్శనంకు అక్కినేని కొత్త దంపతులను తీసుకుని నాగార్జున వెళ్లారు. నాగ చైతన్య పెళ్లి పనులు పూర్తి అయిన వెంటనే తండేల్‌ షూటింగ్‌ కి జాయిన్‌ కాబోతున్నాడు.

చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్‌ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలోనే లవ్ స్టోరీ మూవీ వచ్చింది. హిట్‌ కాంబో కావడంతో తండేల్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె హీరోయిన్‌ కాకముందు కొరియోగ్రాఫర్‌ అనే విషయం తెల్సిందే. అందుకే ఆమె డాన్స్ మూమెంట్స్ విషయంలో అస్సలు రాజీ పడదట. చిన్న చిన్న డీటైల్స్‌ సైతం మిస్‌ కాకుండా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక వేళ ఏదైనా సమస్య అయితే కచ్చితంగా మళ్లీ రీ షాట్‌కు వెళ్లాలని అంటుందట. ఇదే విషయాన్ని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమెజాన్ రానా దగ్గుబాటి టాక్ షో లో నాగ చైతన్య పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాగ చైతన్యతో ప్రత్యేక ఎపిసోడ్‌ను రానా చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్‌లో సాయి పల్లవి ప్రస్థావన వచ్చింది. నువ్వు సాయి పల్లవితో సినిమా చేశావు కానీ పాటలు లేకపోవడంతో బతికి పోయావు, ఆమెతో పాటలకు డాన్స్ చేయాలంటే చాలా టెన్షన్‌గా ఉంటుంది అంటూ చైతూ నవ్వుతూ అనేశాడు. ఆ సమయంలోనే సాయి పల్లవికి రానా ఫోన్ కలిపేశాడు. వెంటనే లైన్‌లోకి వచ్చిన సాయి పల్లవి కొంత సమయం సరదాగా రానాతో మాట్లాడింది.

నాగ చైతన్య చాలా మొహమాటస్తుడు అంటూ సాయి పల్లవి చెప్పింది. ఆయనకు నచ్చకున్నా మౌనంగానే ఉంటారు అంటూ సాయి పల్లవి అంది. మళ్లీ మళ్లీ ఒక షాట్‌ను చేస్తుంది అంటూ సాయి పల్లవి గురించి నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి ఏ విషయం అయినా మొహమాటం లేకుండా మొహాన చెప్పేస్తుందట. కానీ నాగ చైతన్య మాత్రం చాలా రిజర్వ్‌గా ఉంటాడు. ఆయన మొహమాటంతో చాలా సన్నివేశాలు రీ షూట్‌ చేయకుండానే వదిలేశారట. ఎవరితో అయినా నాగ చైతన్య చాలా కామ్‌గా ఉంటాడు అనే టాక్‌ ఉంది. అలాంటి నాగ చైతన్య రెండు సార్లు ప్రేమలో పడటం విశేషం అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.