Begin typing your search above and press return to search.

పాత్ర‌లో ఆత్మ కోసం ఆమెతో సాయిప‌ల్ల‌వి!

ప్ర‌స్తుతం మేజ‌ర్ ముకుంద‌న్ వ‌ర‌జ‌రాజ‌న్ జీవిత ఆధారంగా రాజ్ కుమార్ పెరియాసామి తెర‌కెక్కిస్తోన్న 'అమ‌ర‌న్' లో న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 11:30 PM GMT
పాత్ర‌లో ఆత్మ కోసం ఆమెతో సాయిప‌ల్ల‌వి!
X

పాత్ర‌ల ప‌రంగా సాయిప‌ల్ల‌వి ఎంపిక‌లు ఎలా ఉంటాయి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లైనా వాటిలో వైవిథ్య‌మైన చిత్రాలు ఎంచుకుంటుంది. అమ్మ‌డికి అన‌తి కాలంలోనే అంత మంచి పేరు వ‌చ్చిందంటే? ట్యాలెంట్ తో పాటు ఆ ర‌క‌మైన ఎంపిక‌లే ఆస్థాయికి తీసుకెళ్లాయి. ప్ర‌స్తుతం మేజ‌ర్ ముకుంద‌న్ వ‌ర‌జ‌రాజ‌న్ జీవిత ఆధారంగా రాజ్ కుమార్ పెరియాసామి తెర‌కెక్కిస్తోన్న 'అమ‌ర‌న్' లో న‌టిస్తోంది.

ఇందులో శివ కార్తికేయ‌న్ ముకుంద‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ముకుంద‌న్ స‌తీమ‌ణి రెబాకా పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. బ‌యోపిక్ కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. బ‌లమైన ఎమోష‌న్ ఉంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌చారం చేస్తోంది. ఈనేప‌థ్యంలో తాజాగా సాయి ప‌ల్ల‌వి ఈ పాత్ర గురించి స్పందించింది. `నేను ఇప్ప‌టివ‌ర‌కూ బ‌యోపిక్ లో న‌టించ‌లేదు. వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ పాత్ర‌ను అర్దం చేసుకుని దానికి అనుగుణంగా వ‌ర్క్ చేసాను.

భావోద్వేగాల‌కు పూర్తిగా న్యాయం చేయాల‌నుకున్నా. ఇందులో అవ‌కాశం వ‌చ్చిన స‌మ‌యంలో ముంకుద్ భార్య రెబాకాని క‌లిసాను. ఆమెతో ఎన్నో విష‌యాల గురించి మాట్లాడా. పాత్ర‌కు సంబంధించిన ఎమోష‌న్ గురించి అవ‌గాహ‌న సంపాదించా. ఈ విష‌యంలో ఆమె నాకు ఎంతో స‌హ‌క‌రించారు` అని తెలిపింది.

అలాగే సాయి ప‌ల్ల‌వి బాలీవుడ్ చిత్రాల‌పైనా ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డికి ఏకంగా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లోనే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. `రామాయ‌ణం`లో సీత పాత్ర పోషిస్తుంది. ఇందులో రాముడి పాత్ర పోషిస్తున్న ర‌ణ‌బీర్ క‌పూర్ కి భార్య పాత్ర‌లో క‌నిపిస్తుంది. నితీష్ తివారీ తెర‌కెక్కిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.