చెల్లి పెళ్లిలో చలాకీగా సాయిపల్లవి!
హీరోయిన్ సాయిపల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరి, నటి పూజా కన్నన్ వివాహం ఘనంగా జరిగింది.
By: Tupaki Desk | 5 Sep 2024 11:54 AM GMTహీరోయిన్ సాయిపల్లవి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరి, నటి పూజా కన్నన్ వివాహం ఘనంగా జరిగింది. క్లోజ్ ప్రెండ్ వినీత్ తో పూజ వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఈ జంట నిశ్చితార్దం చేసుకోగా తాజాగా వివాహ బంధంతో ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఈవేడుకలో సాయి పల్లవి సందడి చేసింది. చెల్లెలు పెళ్లిని అమ్మడు దగ్గరుండి జరిపించింది. ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది.
సాయిపల్లవి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. సోదరికి తో కలిసి డాన్సులు చేసింది. తాజాగా పెళ్లి కార్యక్రమం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో కొత్త దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని కూడా అడుగుతున్నారు. దీనికి మాత్రం పల్లవి సమాధానం చెప్పడం లేదు. గతంలో ఓ సందర్భంలో పెళ్లిచేసుకోనని చెప్పింది.
తల్లిదండ్రుల్ని తానే చూసుకుంటానని..వివాహం అంటే ఇష్టం లేదని తెలిపింది. అయితే కొంత కాలానికి పెళ్లిపై తన అభిప్రాయాన్ని మార్చుకుంది. పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడే కాదని తెలిపింది. కానీ ఇప్పు డు అక్క కంటే ముందే చెల్లెలు పెళ్లి అయిపోయింది. చెల్లెలు అంటే సాయి పల్లవికి ఎంతో ఇష్టం.
అక్క అన్న చెల్లెలు అంతే ప్రేమకురిపిస్తుంది. సాయిపల్లవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వెంట ఎప్పుడు చెల్లెలు కూడా కనిపించేది.అక్కతో పాటు నటి కాక ముందే ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంది. ఆ తర్వాత నటిగా మారింది. కానీ సాయి పల్లవి లా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు వివాహ బంధంతో ఓ ఇంటిదయింది.