గురూజీ మనసులో సాయి పల్లవి!
ప్రస్తుతం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి కథ సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 2:00 PM ISTసాయిపల్లవిని హీరోయిన్ గా ఒప్పించడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో ఇటీవలే దర్శకుడు చందు మొండేటి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెని ఒప్పించే సరికి తల ప్రాణం తోకకు వస్తుందని చెప్పకనే చెప్పాడు. ఆవిడతో ఎవరు సినిమా చేయాలనుకున్నా? ఆ డైరెక్టర్ చాలా సందేహాలు నివృతి చేయాలని..అదంత ఈజీగానూ ఉండదని తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.
నా తర్వాత ఆమెతో ఏ డైరెక్టర్ పని చేస్తారో గానీ..అతని పని అయిపోయినట్లేనని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో రామయణంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం ఇంత వరకూ కొత్త సినిమాలేవి కమిట్ అవ్వలేదు. దీంతో 'తండేల్' తర్వాత ఏ సినిమా చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వరుసలో ముందుంది గురూజీ త్రివిక్రమ్ అని సమాచారం.
ప్రస్తుతం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి కథ సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది మైథలాజికల్ టచ్ ఉన్న కథ. ఇప్పటికే మొదటి భాగం కథ సిద్దమైంది. అయితే ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని గురూజీ భావిస్తున్నాడట. సినిమాలో అతడు రాసిన పాత్ర యారోగేంట్ గా ఉంటుందట. ఆ రోల్ కు సాయి పల్లవి పర్పెక్ట్ గా సూటువుతుందట.
దీంతో ఆ పాత్రకు గురూజీ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు డీసెంట్ గానే ఉంటాయి. హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉంటుంది. స్టోరీలో భాగంగానే అతడి పాత్రలు పుడుతుంటాయి. కాబట్టి ఆ రకంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక సాయి పల్లవిని ఒప్పించడం గురూజీకి పెద్ద విషయం కాదు. అతడు ఏ సినిమా చేసినా చాలా క్లియర్ గా ఉంటాడు. పాత్రల విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదు. అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లే ఉంటుంది అతడి వివరణ. కాబట్టి సాయిపల్లవిని మ్యానేజ్ చేయడం అయనకి పెద్ద ప్రాబ్లమ్ కాకపోవచ్చు.