స్వాతంత్య్ర తిరుగుబాటు నేపథ్యంలో సంబరాల ఏటి గట్టు?
విరూపాక్ష తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేస్తే అది అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
By: Tupaki Desk | 17 March 2025 5:00 PM ISTగత కొంతకాలంగా మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ కెరీర్ ఆశాజనకంగా లేదు. అనుకోకుండా అతనికి యాక్సిడెంట్ అవడం, దాంతో సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ రావడం జరిగాయి. ఆ తర్వాత రిలీజైన విరూపాక్ష మంచి సక్సెస్ అయింది. విరూపాక్ష తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేస్తే అది అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
బ్రో తర్వాత సాయి తేజ్ సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుని తన ఆరోగ్యాన్ని సెట్ చేసుకుని వచ్చాడు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సంబరాల ఏటి గట్టు టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ చూశాక సినిమా రాయలసీమ ప్రాంతంలో జరిగే కథగా అర్థమైంది. ఇదిలా ఉంటే సంబరాల ఏటి గట్టు గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఓ బజ్ వినిపిస్తోంది.
ఈ సినిమా కథాంశం దేశ స్వాతంత్య్ర తిరుగుబాటు పై ఉంటుందని, బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి రాయలసీమ ఏరియాలో కరువును అంతం చేసిన వీరుడి కథగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న సంబరాల ఏటి గట్టు రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం సాయి తేజ్ ఎంతో కష్టపడటంతో పాటూ ఈ మూవీపై తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.