రేర్ క్లిక్: మాతృమూర్తితో మెగా హీరో అనురాగం
అతడు ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నా కానీ, అది అతడి సెంటిమెంట్ కి ప్రతీకగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 14 Aug 2024 4:01 AMమెగా స్టార్ చిరంజీవి సోదరి విజయ దుర్గ కుమారుడు సాయి దుర్గ తేజ్. మెగా మేనల్లుడిగా ఈ యువహీరో సుప్రసిద్ధుడు. రేయ్ సినిమాతో తెరకు పరిచయం అయిన సమయంలో అతడి పేరు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత అది సాయి తేజ్ గా మారింది. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ గా రూపాంతరం చెందింది. అతడు ఎన్నిసార్లు పేర్లు మార్చుకున్నా కానీ, అది అతడి సెంటిమెంట్ కి ప్రతీకగా కనిపిస్తోంది. అమ్మ ప్రేమకు ప్రతీకగా ఇప్పుడు తన పేరుకు 'దుర్గ'ను జోడించాడు. ఇకపైనా అజేయుడిగా అతడు తన కెరీర్ రన్ సాగించాలని ఉత్సాహంగా ఉన్నాడు.
సాయి దుర్గ తేజ్ తన తల్లి విజయ దుర్గా ప్రొడక్షన్స్ పేరుతో తన స్వంత చలనచిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇకపై ఈ బ్యానర్ లో ప్రతిభావంతులకు అవకాశాలు దక్కనున్నాయి. సాయి ధరమ్ మంచి కథల్ని ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మించాలనే ప్రణాళికతో ఉన్నాడు.
ఇలాంటి సమయంలో తన తల్లి విజయదుర్గ ఈరోజు పుట్టినరోజును పురస్కరించుకుని అతడు ఇన్ స్టాలో విషెస్ తెలియజేసాడు. తన తల్లి దుర్గ గారితో ఉన్న ఫోటోని షేర్ చేసాడు. అమ్మకు హృదయపూర్వక సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. ''హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్యూటిఫుల్ అమ్మా... ఐ లవ్ యు! అని'' సాయి దుర్ఘ తేజ్ పోస్ట్ చేసారు. సాయి షేర్ చేసిన ఫోటోలో అతడి తల్లి తన గడ్డాన్ని ఆప్యాయంగా లాగడం కనిపించింది. తల్లి కుమారుల అనుబంధం అభిమానుల్లోను స్ఫూర్తిని నింపింది. అమ్మ అంటే ప్రాణ సమానం.. జీవితంలో అంతకంటే విలువైన వ్యక్తి వేరొకరు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనా దేవి గారిని ఎంత ప్రేమగా అభిమానంగా చూసుకుంటారో తెలిసినదే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సాయి దుర్ఘ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.'సంబరాల ఏటిగట్టు' అని తాత్కాలికంగా టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. హను-మాన్ నిర్మాత కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సాయిదుర్ఘ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుమారు 60 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెడుతున్నారని టాక్ ఉంది.