ముఖ్యమంత్రులకు సాయితేజ్ విన్నపం!
సోషల్ మీడియాలో జరుగుతోన్న కొన్ని రకాల దారుణాలపై సాయిదుర్గతేజ్ మరో ట్వీట్ చేసాడు.
By: Tupaki Desk | 7 July 2024 5:41 PM GMTసోషల్ మీడియాలో జరుగుతోన్న కొన్ని రకాల దారుణాలపై సాయిదుర్గతేజ్ మరో ట్వీట్ చేసాడు. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ట్విటర్ వేదికగా కోరాడు. ఈ పోస్ట్ చేసిన కాసేపటికి మరో పోస్ట్ చేసాడు. ఫన్నీ పేరుతో చిన్న పిల్లల్ని ట్రోల్ చేస్తోన్న ఓవీడియోని పోస్ట్ చేసాడు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, పోలీసుల్ని కోరాడు.
కొంత మంది యూట్యూబర్స్ ఓ తండ్రి..కుమార్తె వీడియోని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వీడియోని పోస్ట్ చేసి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పందించారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు మీకు ధన్యవాదాలు. చిన్న పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. చిన్న పిల్లల్ని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెడితే ఉపేక్షించమని, తగిన చర్యలు తీసుకుంటామని భట్టి హెచ్చరించారు.
వీరిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వీడియోలు ఎవరూ చేయద్దని సూచించారు. దీనిపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ స్వయానా మేనమామ కాబట్టి రిప్లై ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎలాంటి బధులు రాలేదు. `సోషల్ మీడియా ప్రపంచ క్రూరమైనది. ప్రమాదకరంగా మారింది. నియంత్రించడం చాలా కష్టంతో కూడిన పని. పిల్లల గురించి ఏ పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి.
సోషల్ మీడియాలో కొందరు విచక్షణరహితంగా మారుతున్నారు. ఈ జంతువులను హింసాత్మకంగా, ప్రమాదకరంగా మారకుండా ఆపండి. కొంత మంది చేసే వ్యాఖ్యలు, వీడియోలు తట్టుకోలేరు. అందుకే తల్లిదండ్రులంతా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరాడు` సాయితేజ్ పోస్ట్ లో కోరాడు.