Begin typing your search above and press return to search.

వైరల్‌ పిక్‌.. మెగా స్టైలిష్ లుక్‌

దశాబ్ద కాలం సినీ కెరీర్ ని ముగించుకోబోతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:45 AM GMT
వైరల్‌ పిక్‌.. మెగా స్టైలిష్ లుక్‌
X

దశాబ్ద కాలం సినీ కెరీర్ ని ముగించుకోబోతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గంజ శంకర్‌ సినిమా ను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు సాయి ధరమ్‌ తేజ్ తీసుకు రాబోతున్నాడు.


ఇక తాజాగా ఇన్‌ స్టా లో సాయి ధరమ్‌ తేజ్ అల్ట్రా స్టైలిష్‌ లుక్ లో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో సాయి ధరమ్‌ తేజ్ చాలా హ్యాండ్సమ్‌ గా కనిపిస్తున్నాడు. లేడీ ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి రిసెప్షన్ కి సాయి ధరమ్‌ తేజ్ ఈ ఔట్‌ ఫిట్‌ లోనే కనిపించాడు. వరుణ్‌ లావణ్య ల పెళ్లి రిసెప్షన్ ఫోటోలు అంటూ సాయి ధరమ్‌ తేజ్ ఈ ఫోటోలకు కామెంట్‌ చేశాడు. బ్లాక్‌ సూట్ లో సాయి ధరమ్‌ తేజ్‌ మెగా స్టైలిష్ గా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆ మధ్య యాక్సిడెంట్‌ కారణంగా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడంతో సాయి ధరమ్‌ తేజ్ కాస్త బరువు పెరిగాడు. విరూపాక్ష సమయంలో బరువు తగ్గిన సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పుడు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి సాయి ధరమ్‌ తేజ్ లుక్‌ వైరల్‌ అయింది. ఈ మెగా హీరో స్టైలిష్‌ లుక్‌ పై మీరు ఒక లుక్‌ వేయండి.