Begin typing your search above and press return to search.

మెగా హీరో మూవీ... ఫస్ట్‌ సక్సెస్‌!

ఇటీవల హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఏకంగా 13 అతి పెద్ద సెట్టింగ్స్ ను ఈ సినిమా కోసం నిర్మించారు అనే వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   9 July 2024 5:14 AM GMT
మెగా హీరో మూవీ... ఫస్ట్‌ సక్సెస్‌!
X

సాయి ధరమ్‌ తేజ్ హీరోగా హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్‌ తో రోహిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. సాయి ధరమ్‌ తేజ్ గత చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు హనుమాన్‌ భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సినిమాను వంద కోట్లకు మించిన బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఏకంగా 13 అతి పెద్ద సెట్టింగ్స్ ను ఈ సినిమా కోసం నిర్మించారు అనే వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ భారీ సెట్స్‌ లోనే మొదటి షెడ్యూల్‌ ను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

ఫస్ట్‌ షెడ్యూల్‌ సూపర్‌ సక్సెస్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. తదుపరి షెడ్యూల్‌ కి సంబంధించిన ప్రొడక్షన్‌ వర్క్ ను షురూ చేసినట్లుగా తెలుస్తోంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ ను ముగించాలనే ఉద్దేశ్యంతో నిర్మాత ఉన్నాడట.

వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమాను విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడంతో పాటు భారీ స్టార్‌ కాస్టింగ్ ఉన్న సినిమాగా తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం కూడా భారీగా ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

సాయి ధరమ్‌ తేజ్ తో పాటు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా పై చాలా ఆసక్తి పెంచుకుంటున్నారు. కొత్త దర్శకుడు అయినా ఇంత భారీ బడ్జెట్‌ సినిమాను చక్కగా హ్యాండిల్‌ చేస్తున్నాడు అంటూ ఫస్ట్‌ షెడ్యూల్‌ సక్సెస్ తో తేలిపోయిందని చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.