మామకు ప్రేమతో అల్లుడు కాలి నడకన!
పవన్ కళ్యాణ్ అంటే సాయి తేజ్ కి ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఓ సాధారణ అభిమానిలా మామని ప్రేమిస్తాడు
By: Tupaki Desk | 15 Jun 2024 8:39 AM GMTపవన్ కళ్యాణ్ అంటే సాయి తేజ్ కి ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఓ సాధారణ అభిమానిలా మామని ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈయన కూడా మామకి అపారమైన భక్తుడు అనడంలో అతిశయోక్తిలేదు. అల్లుడిని కూడా పవన్ అలాగే అభిమానిస్తాడు. అందుకే కెరీర్ డౌన్ ఫాల్ లోఉన్న సమయంలో సాయితేజ్ కి బూస్టింగ్ ఇచ్చేందుకు తనతో కలిసి ఓ సినిమా కూడా చేసాడు.అలా మామ-అల్లుడి మధ్య మంచి బాండింగ్ కొనసాగుతుంది.
ఇక పవన్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మామని ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడో? తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైరల్ గానూ మారింది. పవన్ కి ఊపిరి ఆడనంత బలంగా కౌగిలించుకుని తన ప్రేమని చాటాడు. పవన్ కళ్యాణ్ కోరిక కూడా తీరడంతో సాయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. దర్శనం అంటే సాధారణం దర్శనం కాదు. ఏకంగా కాలినడకనే స్వామి వారికి మొక్కు చెల్లించాడు.
అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నాడు. అంతకు ముందు పద్మావతి అతిథి గృహంలో బస చేసి కాలినడక అనంతరం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇంత వరకూ కాలి నడకన ఏ రోజు ఏడు కొండలకు చేరుకొలేదు. తన జీవితం కోసం కూడా ఏనాడు అంతగా తపించి ఉండడు. కానీ మామ గెలుపు కోసం ఎంతగా తపించాడో? కాలినడకన చేరుకోవడంతోనే అర్ధమవుతుంది.
మామ గెలవాలంటూ సాయితేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై గాజు సీసాలతో ప్రత్యర్దులు దాడి చేసినట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. తనకు తగలాల్సిన సీసా పెంకులు సాధారణ కార్యకర్తలకు తగలడంతో చలించిపోయిన ఉదంతం అభిమానులు చూసారు.