పెళ్లి అంటూ ప్రేమ లేకుండా చేస్తున్నారా తేజ్..!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమ మరియు పెళ్లి విషయాల గురించి రెగ్యులర్ గా మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.
By: Tupaki Desk | 29 July 2024 4:16 AMమెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమ మరియు పెళ్లి విషయాల గురించి రెగ్యులర్ గా మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటూ కొన్ని సార్లు, ప్రేమలో ఉన్నాడని ఎక్కువ సార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.
ఆయన ఏ ఇంటర్వ్యూలో అయినా, ఆయన పాల్గొన్న ఏ మీడియా సమావేశంలో అయినా కూడా పెళ్లి వార్తలపై కామెంట్ ప్లీజ్ అంటూ అడగడం పరిపాటి అయ్యింది. తాజాగా ఈ మెగా హీరో ఉషా పరిణయం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా మరోసారి అదే ప్రశ్న ను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ మీ లవ్ గురించి చెప్పండి అని అడిగింది. అప్పుడు సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో స్పందించారు. నాకు లవ్ ఉంది, కానీ అది వన్ సైడ్ లవ్. అటు నుంచి స్పందన లేదు, ఆ స్పందన కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు.
ఎవరైనా అమ్మాయి నాకు నచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మీకు పెళ్లి అయిపోయిందట కదా అండి అంటూ నన్ను ఎదురు ప్రశ్నిస్తున్నారు అంటూ సరదా కామెంట్ చేశాడు. పాపం సోషల్ మీడియాలో పుకార్ల వల్ల సాయి ధరమ్ తేజ్ కి ప్రేమ లేకుండా పోయిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే విరూపాక్ష సినిమా తర్వాత బ్రో సినిమా చేశాడు. ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తూ హనుమాన్ నిర్మాత ఈ సినిమాను తేజ్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా కు సంబంధించిన అన్ని విషయాలను వెళ్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.