Begin typing your search above and press return to search.

సాయి దుర్గ తేజ్.. మరోసారి వీరుపాక్ష కాంబో

ఈ చిత్రానికి హాలీవుడ్ క‌ల్ట్ యాక్ష‌న్ మూవీ "300" వంటి హంగులు కూడా ఉన్నాయ‌ని చెప్ప‌డం సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 7:11 PM GMT
సాయి దుర్గ తేజ్.. మరోసారి వీరుపాక్ష కాంబో
X

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన కొత్త సినిమా SDT18 నుంచి విడుదల చేసిన ఒక టీజర్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఈ టీజర్ లో అతడి మేకోవర్, పవర్ఫుల్ బాడీ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా హైలెట్ అయ్యాయి. ఈ చిత్రానికి హాలీవుడ్ క‌ల్ట్ యాక్ష‌న్ మూవీ "300" వంటి హంగులు కూడా ఉన్నాయ‌ని చెప్ప‌డం సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.


దీనికి తోడు సోషల్ మీడియాలో తేజ్ కొత్త లుక్, స్లిమ్ ఫిట్ బాడీకి అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత ఊరించే అప్‌డేట్ ను అందించారు మేకర్స్. ‘విరూపాక్ష’ మూవీకి మ్యూజిక్ అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ బి. లోక్‌నాథ్ ఈ సినిమాలో కూడా సంగీతం అందిస్తున్నారు. ‘విరూపాక్ష’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కు విపరీతమైన ఆదరణ దక్కిన నేపథ్యంలో SDT18 లో కూడా అజనీష్ మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంగీతం SDT18 సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, మ్యూజిక్ మేజిక్ మరొకసారి పునరావృతం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. రోహిత్ కేపీ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి ఈ భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ స్పెక్టకిల్ ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ లో ఉన్న ప్రత్యేకత ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించింది. పోస్టర్ లో అజనీష్ ముఖ చిత్రాన్ని పెద్ద బ్యానర్ పై చిత్రీకరించి చూపించడం జరిగింది. అద్భుతంగా డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ సినిమాకు విశేషం తెచ్చిపెట్టింది. మొత్తం పోస్టర్ లో బ్యాక్ డ్రాప్ గా పురాతన యుద్ధానికి సంబంధించి భారీ సామాగ్రి సెట్టింగ్ లో చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. SDT18 సినిమా ద్వారా తేజ్ మరియు అజనీష్ ల కాంబినేషన్ మరోసారి థియేటర్లలో మ్యూజికల్ మ్యాజిక్ చేయబోతోందనే మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.