Begin typing your search above and press return to search.

స్నేహితుడి కోసమా? శాశ్వ‌తంగానా?

ఆ త‌ర్వాత కొంత కాలానికి న‌వీన్ లుక్ లోనూ చాలా మార్పులొచ్చాయి.

By:  Tupaki Desk   |   28 Oct 2024 10:40 AM GMT
స్నేహితుడి కోసమా? శాశ్వ‌తంగానా?
X

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కుమారుడు న‌వీన్ విజ‌య్ కృష్ణ సుప‌రిచితుడే. విజ‌య నిర్మల మ‌న‌వ‌డిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన న‌వీన్ `నందిని న‌ర్సింగ్ హోమ్`.. `ఊరంతా అనుకుంటారు` లాంటి సినిమాలు చేసాడు. దీంతో న‌వీన్ న‌టుడిగా సినిమా కెరీర్ ని ఎంచుకుని ముందుకెళ్తున్నాడ‌ని భావించారంతా. కానీ న‌టుడిగా న‌వీన్ బిజీ కాలేదు. ఆ త‌ర్వాత కొంత కాలానికి న‌వీన్ లుక్ లోనూ చాలా మార్పులొచ్చాయి.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో `సోల్ ఆఫ్ స‌త్య` అనే ఫీచ‌ర్ ఫిల్మ్ తో ద‌ర్శుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌న స్నేహితుడు సాయితేజ్ న‌టించాడు. దీంతో న‌వీన్ కెరీర్ లో ఇది కొత్త ట‌ర్నింగ్ గా అప్ప‌ట్లో హైలైట్ అయింది. అయితే ఇప్పుడు అదే స్నేహితు కోసం న‌వీన్ మంచి ఎడిట‌ర్ కాబోతున్నాడు. సాయితేజ్ హీరోగా `ఎస్‌డీటీ -18` చిత్రానికి న‌వీన్ ఎడిటర్ గా మారాడు. రోహిత్ కె.పి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి నవీన్‌ ఎడిటర్‌గా ఆన్‌బోర్డ్‌ కావడంపై హీరో సాయి దుర్గా తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.`నా సోదరుడు, నా స్నేహితుడు నాకెరీర్‌లో అత్యంత కీలకంగా భావిస్తున్న నా `ఎస్‌డీటీ -18` చిత్రానికి జాయిన్‌ కావడం ఆనందంగా ఉంది. నా కోసం ఎప్పుడూ ఓ పిలుపు దూరంలోనే ఉండే ఇలాంటి స్నేహితుడు నా కోసం ఏమైనా చేస్తాడని మరోసారి ప్రూవ్‌ చేశాడు` అని రాసుకొచ్చారు.

న‌వీన్ తొలి సినిమాతోనే స్కిల్ ఉన్న న‌టుడిగా నిరూపించుకున్నాడు. మంచి న‌టుడ‌వుతాడ‌ని భావించారు. కానీ న‌టుడు కంటే న‌వీన్ మంచి ఎడిట‌ర్. ఆ విష‌యంలో సూపర్ స్టార్ మ‌హేష్ చేత‌నే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. మ‌రిప్పుడు న‌వీన్ కెరీన్ ని పూర్తి స్థాయిలో ఎడిట‌ర్ గా కొన‌సాగిస్తాడా? లేక ఆ ఎడిటింగ్ ట్యాలెంట్ అన్న‌ది కేవ‌లం స్నేహితుడి సినిమా వ‌ర‌కే ప‌రిమితం చేస్తాడా? అన్న‌ది చూడాలి.