సీఎం రేవంత్ తో మెగా హీరో భేటి!
ఇటీవలే తండ్రి-కుమార్తె మధ్య ఉన్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా ఓ యూట్యూబ్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 July 2024 2:12 AM GMTమెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి వున్నారు. మరి సాయితేజ్ అత్యవసరంగా సీఎంని ఎందుకు కలిసినట్లు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఇటీవలే తండ్రి-కుమార్తె మధ్య ఉన్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా ఓ యూట్యూబ్ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ ప్రణీత్ హనుమత్ నీచపు బుద్దిపై సాయితేజ్ అగ్రహం వ్యక్తం చేసాడు. ప్రభుత్వాలు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రుల్ని, ఉపముఖ్యమంత్రిల్ని కోరారు. ఇలాంటి వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవరించాలని కోరారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు సాయితేజ్ ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని భరోసా కల్పించారు. సమాజంలో జరిగే వివక్షపై తమ ప్రభుత్వం ఎప్పుడు కఠినంగానే ఉంటుందని రేవంత్ స్పందించినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం సినిమా ఇండస్ట్రీ విశేషాలు సాయితేజ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
సాయితేజ్ కూడా సామాజిక స్పృహా వున్న నటుడు. ఇటీవల `సత్య` అనే సామాజిక సందేశం వున్న సినిమాతో దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలిసేలా చేసాడు. అలాగే ప్రభుత్వం తరపున చెపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.