బావ..తమ్ముడి స్పూర్తితో 1940 కెళ్తున్నాడా?
తాజాగా పెద్ద మేనల్లుడు సాయితేజ్ కమిట్ అయిన సినిమా కూడా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 29 April 2024 6:50 AM GMTసుప్రీమ్ స్టార్ సాయి దుర్గ తేజ్, బావ-తమ్ముడ్ని ఫాలో అవుతున్నాడా? సక్సెస్ కావాలంటే వాళ్ల మార్గమమే సరైనదిగా భావించాడా? అంటే అవునే తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పల్లెటూరి నేపథ్యంలో 1970-80 కాలంలోకివెళ్లి మరీ తెరకెక్కించారు. సెట్స్ రూపంలో అప్పటి వాతావరణాన్ని ఎంతో అందంగా తీసుకొచ్చారు. అందుకు తగ్గట్టు పాత్రలు అంతే బలంగా పడటంతో బ్లాక్ బస్టర్ అయింది. చరణ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
అటుపై మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూని కూడా ఇలాగే బలమైన పల్లెటూరి మత్సకార నేపథ్యాన్ని తీసుకుని సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అదే 'ఉప్పెన'. నటనకు బలమైన ఆస్కారం ఉన్న రోల్ కావడంతో మొదటి సినిమాతోనే సెంచరీ కొట్టిన స్టార్ గా నిలబడ్డాడు.
ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించడం విశేషం. దర్శకుడిగా ఇదే అతడి తొలి చిత్రం కూడా. అలా వైష్ణవ్-బుచ్చి మొదటి సినిమాతోనే తమ ట్యాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి మత్సకార నేపథ్యంతో తో పొలిక చేస్తే కాస్త ఓల్డ్ వెర్షన్ స్టోరీ అనే చెప్పాలి.
అందుకోసం దర్శకుడు ఓ ఇరవై ఏళ్ల క్రితానికి వెళ్లాడు. తాజాగా పెద్ద మేనల్లుడు సాయితేజ్ కమిట్ అయిన సినిమా కూడా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైన సెట్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో తేజ్ మునుపెన్నడు చేయని విభిన్నమైన పాత్ర పోషి స్తున్నాడు. అతడితో సహా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే రోల్ అని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రానికి రాకేష్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు.
'హనుమాన్' తో ఫేమస్ అయిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. సాయితేజ్ స్టార్ అనే ఇమే జ్ చట్రం నుంచి బయటకు వచ్చి చేస్తోన్న మూడవ చిత్రమిది. ఒకప్పుడు ఆయన పూర్తిగా కమర్శియల్ సినిమాలే చేసేవాడు. దర్శకుల ఎంపికలో అతని అనుభవం ఎంత? ఏంటి అని కొలమానాలు చూసేవాడు. ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు. 'రిపబ్లిక్' తో తొలిసారి తనలో మార్పు కనిపించింది. ఆ మార్పు 'విరూపాక్ష'తో వంద కోట్ట హీరోని చేసింది. ఇప్పుడు ఏకంగా సరికొత్త బ్యాక్ డ్రాప్ లోనే రాబోతున్నాడు.