Begin typing your search above and press return to search.

చుక్క‌ల మ‌ధ్య‌లో అంద‌మైన చంద‌మామ‌!

ఓ క్లోజ‌ప్ షాట్ లో అచ్చంగా అలాగే హైలైట్ అయింది. చున్నీ వెనుక దాగిన త‌న అందాన్ని ఇలా హైలైట్ చేసింది. బ్యూటీ త‌న‌లో క్లీవేజ్ అందాల‌తో మ‌రోసారి మంత్ర‌ముగ్దుల్ని చేసింది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 3:00 AM GMT
చుక్క‌ల మ‌ధ్య‌లో అంద‌మైన చంద‌మామ‌!
X

చుక్క‌ల మ‌ధ్య‌లో చంద‌మామ అందాన్ని వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం. మిరుమిట్లు గొలిపే న‌క్ష‌త్రాల మ‌ధ్య‌లో నిండైన‌ చంద‌మామ ఎంతో అందంగా..అద్భుతంగా క‌నిపిస్తుంది. ఇది ఆకాశంలో క‌నిపించే చంద‌మామ గురించి. మ‌రి భూలోకంలో అంత‌టి అంద‌మైన చంద‌మామ ఎవ‌రు? అంటూ ఈ 22 ఏళ్ల‌ బ్యూటీ గురించి మాట్లాడుకోవాలేమో!

అవును బాలీవుడ్ యువ న‌టి స‌యిమంజ్రేక‌ర్ ఇక్క‌డ అంతే అందంగా హైలైట్ అవుతుంది. లెహంగా దుస్తుల్లో అమ్మడి బ్యూటీకి ఫిదా అవ్వాల్సిందే. చున్నీ పై ఉన్న చుక్క‌ల డిజైన్ తోనే తానో చుక్క‌ల్లో చంద‌మామలా మెరిసింది. ఓ క్లోజ‌ప్ షాట్ లో అచ్చంగా అలాగే హైలైట్ అయింది. చున్నీ వెనుక దాగిన త‌న అందాన్ని ఇలా హైలైట్ చేసింది. బ్యూటీ త‌న‌లో క్లీవేజ్ అందాల‌తో మ‌రోసారి మంత్ర‌ముగ్దుల్ని చేసింది.

చార‌డేసి క‌ళ్లు..నుదిటిన వైట్ స్టిక‌ర్..పెదాల‌పై ఎరుపందం..చెవుల‌కు ధ‌రించిన బుట్ట‌లు ప్ర‌తీది అమ్మ‌డి అందాన్ని అంత‌కంత‌కు రెట్టింపు చేసాయి. వివిధ భంగిమ‌ల్లో అమ్మ‌డు ఇచ్చిన ఫోజులు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అమ్మ‌డికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ని ఇలా ఎన్ క్యాష్ చేసుకుంటుంది.

ఇక ఈబ్యూటీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం తండ్రీ-కుమార్తెలిద్ద‌రు ప్రోఫెష‌న‌ల్ గా దూసుకుపోతున్నారు. తెలుగులో గ‌ని సినిమాతో లాంచ్ అయింది. అటుపై 'మేజ‌ర్' స‌క్సెస్ తో బాగా పాపుల‌ర్ అయింది. బోయ‌పాటి యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రం స్కంద‌లోనూ న‌టించింది. కానీ మేజ‌ర్ త‌ప్ప మిగిలిన రెండు చిత్రాలు నిరాశ‌నే మిగిల్చాయి.