Begin typing your search above and press return to search.

చీరలో స్కంద బ్యూటీ.. ఎంత అందంగా ఉందొ..

తాజాగా సాయీ మంజ్రేకర్ బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:51 AM GMT
చీరలో స్కంద బ్యూటీ.. ఎంత అందంగా ఉందొ..
X

బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’తో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ దర్శకుడు,నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురుగా ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘దబాంగ్ 3’ తర్వాత తెలుగులో వరుణ్ తేజ్ కి జోడీగా ‘గని’ సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత అడివి శేష్ కి జోడీగా ‘మేజర్’ చిత్రంలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

చివరిగా ఆమె తెలుగులో రామ్ పోతినేని ‘స్కంద చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. హిందీలో ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వాటిలో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ‘ఔరోన్ మే కహన్ దమ్ థా’ ఒకటి. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ది ఇండియన్ హౌస్’ లో ఈ బ్యూటీనే హీరోయిన్ గా చేస్తోంది. దీంతో పాటు ఒకటి, రెండు సినిమాలు సాయీ కమిట్ అయినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ అమ్మడు ఎక్కువగా తన బ్యూటీని రిప్రజెంట్ చేసే అవుట్ ఫిట్స్ తో దిగిన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాయీ మంజ్రేకర్ బ్లాక్ శారీలో ఉన్న ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో సాయీ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఫ్యాషన్ అవుట్ ఫిట్ లకంటే ట్రెడిషనల్ చీరకట్టులోనే మరింత అందంగా సాయీ మంజ్రేకర్ కనిపిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్లాక్ కలర్ శారీలో బ్లాక్ అండ్ వెయిట్ ఫోటో షూట్ లో సాయీ మెస్మరైజ్ చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు పూర్థిస్థాయిలో ఆమెలోని నటిని తెరపై చూపించే సినిమా పడలేదనే మాట వినిపిస్తోంది. ‘మేజర్’ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ట్రెడిషనల్ లుక్ తో ఉన్న ఓ మంచి క్యారెక్టర్ సినిమాలో పడితే చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి అలాంటి పాత్రలు సాయీ మంజ్రేకర్ కి ఎవరైనా ఆఫర్ చేస్తారేమో చూడాలి.