పొట్టి ఫ్రాకులో మేజర్ బ్యూటీ స్పెషల్ ట్రీట్
పొట్టి ఫ్రాకు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సయీ స్పెషల్ గా కనిపించింది. అలాగే తన కళ్లకు షేడ్స్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ తో ఆకర్షించింది.
By: Tupaki Desk | 26 July 2024 12:30 PM GMT'మేజర్' లాంటి పాన్ ఇండియా చిత్రంలో ట్యాలెంటెడ్ అడివి శేష్ సరసన నటించింది సయీ ముఖర్జీ. దబాంగ్ 3లో సల్మాన్ సరసన నటించాక తెలుగులో ఘనమైన ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు-హిందీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు తమిళంలోను ఈ భామకు అవకాశాలొస్తున్నాయి.
సయీ మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టుగాను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భామ నిరంతర విహారయాత్రలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తోంది. అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తన కజిన్స్ తో కలిసి విదేశీ విహారంలో ఉన్న సయీ ముఖర్జీ వరుస ఫోటోలను షేర్ చేస్తోంది. యుద్ధం చూసిన అందమైన నగరం అంటూ ఆసక్తికర క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేయగా, అందులో సయీ ముఖర్జీ లుక్ యువతరం దృష్టిని ఆకర్షించింది. పొట్టి ఫ్రాకు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సయీ స్పెషల్ గా కనిపించింది. అలాగే తన కళ్లకు షేడ్స్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ తో ఆకర్షించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి అజయ్ దేవగన్, టబు లాంటి జాతీయ ఉత్తమ తారలతో కలిసి సయీ మంజ్రేకర్ పని చేస్తోంది. ఔరాన్ మే కహన్ దమ్ థా (అనువాదం. వేర్ డిడ్ అదర్స్ హావ్ ద కరేజ్) అనేది మూవీ టైటిల్. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ లో దేవగన్, టబులకు జంటగా పదో సినిమా. జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి- సాయి మంజ్రేకర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. M. M. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరాన్ మే కహన్ దమ్ థా 5 జూలై 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల 2 ఆగస్ట్ 2024కి వాయిదా పడింది.