Begin typing your search above and press return to search.

ఆయ‌న మాట‌ల‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారా?

వాళ్ల పాత్ర‌ల్ని ప‌క్క‌న‌బెడితే ఓం రౌత్ మేకింగ్ తోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:59 AM GMT
ఆయ‌న మాట‌ల‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారా?
X

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ వ్యాఖ్య‌ల ప‌ట్ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానులు హ‌ర్ట్ అయ్యారా? అందుకే అభిమానులు కాస్తాంత నిరాశ‌గా ఉన్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ బాలీవుడ్ డెబ్యూ `ఆదిపురుష్` ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. ఓం రౌత్ తెర‌కెక్కిం చిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై వాటిని అందుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది ఇందులో రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్...లంకేశ్వ‌రుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టించారు.

వాళ్ల పాత్ర‌ల్ని ప‌క్క‌న‌బెడితే ఓం రౌత్ మేకింగ్ తోనే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఫ‌లితంగా ఆ ప్ర‌భావం అన్ని పాత్ర‌ల‌పైనా ప‌డింది. అంద‌రూ ట్రోలింగ్ బారిన ప‌డ్డారు. ఇదంతా గ‌తం. దీనికి గురించి అంతా మ‌ర్చిపోయారు కూడా. అయితే `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగా సైఫ్ అలీఖాన్ ముందుకు ఓ ప్ర‌శ్న వెళ్ల‌డం...దానికి అత‌డు స‌మాధానం చెప్ప‌డం డార్లింగ్ అభిమానులు నోచ్చుకోవ‌డానికి దారి తీసింది.

దేవ‌ర టీమ్ ని ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా సందీప్ రెడ్డి వంగా జాన్వీ కపూర్‌ని `దేవర` మీ మొదటి తెలుగు సినిమా క‌దా? అని అడిగాడు. దానికి ఆమె అవున‌ని స‌మాధానం చెప్పింది. ఆ వెంట‌నే ప‌క్క‌నే ఉన్న‌ సైఫ్ అలీ ఖాన్ తన మొదటి దేవ‌ర‌గా తెలిపాడు. ఈ వ్యాఖ్య ప్రభాస్ అభిమానులలో వివాదాన్ని రేకెత్తించింది.

ఆయ‌న ప్ర‌భాస్ తో `ఆదిపురుష్` చేసాడు క‌దా? అది క‌దా అత‌డి మొద‌టి సినిమా. దాని గురించి చెప్పాల్సిం దిపోయి `దేవ‌ర` మొద‌టి సినిమా అంటారేంటి? అని అభిమానుల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ సినిమా ప్లాప్ అయిన కార‌ణంగా సైఫ్ `ఆదిపురుష్` గురించి చెప్ప‌లేదా? అలా చెప్ప‌డం ఆయ‌న‌కు ఇష్టం లేక‌న దేవ‌ర మొద‌టి సినిమా అంటున్నాడా? అనే గుస గుస న‌డిడించింది. `దేవ‌ర‌`తోనే సైఫ్ అలీఖాన్ ని గుర్తించాల‌ని అలా చెప్పాడా? అంటూ ఒకటే చ‌ర్చ‌కు దారి తీసింది.

సైఫ్ అలీఖాన్ అంత‌రార్దం ఏంటో తెలియ‌దు గానీ ప్ర‌భాస్ అభిమానులు మాత్రం నొచ్చుకున్నారు. అయితే `ఆదిపురుష్` హిందీలో తీసిని సినిమా. దాన్ని తెలుగులో అనువ‌దించారు. ఆ ర‌కంగా చూసుకుంటే సైఫ్ అలీఖాన్ తొలి తెలుగు సినిమా దేవ‌ర అవుతుంది. ఆకోణంలో సైఫ్ అలీఖాన్ అలా చెప్పి ఉండొచ్చు. అది తెలిసిన అభిమానులు రియ‌లైజ్ అయ్యే అవ‌కాశం ఉంది.