Begin typing your search above and press return to search.

భార్య ద‌గ్గ‌ర ఇరికించాల‌నుకున్నాడు కానీ జ‌స్ట్ మిస్!

బాలీవుడ్ దంప‌తులు సైఫ్ అలీఖాన్-క‌రీనా క‌పూర్ జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 5:30 PM GMT
భార్య ద‌గ్గ‌ర ఇరికించాల‌నుకున్నాడు కానీ జ‌స్ట్ మిస్!
X

బాలీవుడ్ దంప‌తులు సైఫ్ అలీఖాన్-క‌రీనా క‌పూర్ జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. త‌మ ధాంపత్య జీవితాన్ని ఎలా లీడ్ చేస్తున్నాము అన్న‌ది సైతం ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకుంటారు. గొప్ప త‌ల్లిదండ్రులుగానూ త‌మ బాద్య‌త‌లు నెర‌వేస్తున్నారు. సినిమా.. వ్యాపారం అంటూ ఎంత బిజీగా ఉన్నా? కుమారులు తైమూర్ అలీ ఖాన్ - జెహ్ అలీ ఖాన్ విష‌యంలో ఏమాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించారు.

ఇంట్లో పిల్ల‌ల సంర‌క్ష‌లున్నా? షూటింగ్ ముగించుకుని ఇంటికొస్తే వాళ్లే అన్ని బాధ్య‌త‌లు చూసుకుంటారు. కానీ ఇంత స్పేస్ ని మాత్రం కరీనా గానీ...సైఫ్ గానీ వ్య‌క్తిగ‌త జీవితానికి కూడా కేటాయించుకోరు. తాజాగా కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షోలో సైఫ్ అలీఖాన్ త‌న త‌ల్లి షర్మిలా ఠాగూర్‌తో కలిసి హాజ‌ర‌య్యారు. త‌ల్లి-కుమారుల బంధం గురించి అడ‌గ‌గా ఇరువురు ఎంతో చ‌క్క‌గా స‌మాధానాలిచ్చారు.

వారి మ‌ధ్య బంధం ఎంత బ‌లంగా ఉంటుంద‌న్న‌ది విరించారు. ఇదే సంద‌ర్భంలో క‌ర‌ణ్ ...సైఫ్ అలీఖాన్ ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నం చేసి జ‌స్ట్ మిస్ అయ్యాడు. భార్య క‌రీనా క‌పూర్ తో గొడ‌వ ప‌డిన త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసిపోయే అత్యంత సుల‌భ‌మైన మార్గం ఏంటి? దాన్ని ఎలా అనుస‌రిస్తావ్ అని అడిగాడు...దానికి సైఫ్ అలీఖాన్ వేద పురాణ ప్రత్యుత్తరం ఇచ్చి సింపుల్ గా క్ష‌మించ‌మ‌ని అడిగితే స‌రి అంతా సెట్ అయిపోతుంద‌న్నాడు.

ఇద్ద‌రు మాట్లాడుకోని సంద‌ర్భం ఉందా? అంటే ఉన్నాయి. మాట్లాడుకోవాల‌ని ఇద్ద‌రు డిసైడ్ అయితే ఇద్ద‌రం మాట్లాడుకోం కొన్ని రోజుల పాటు. అదే మాట్లాడుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు కోపాల‌న్ని ప‌క్క‌న‌బెట్టి మాట్లాడుకుంటాం. మా మ‌ధ్య అదేం పెద్ద స‌మ‌స్య కాదు. సింపుల్ గా సారీలు చెప్పుకుని కోపాలు ప‌క్క‌న‌బెడ‌తాం` అన్నాడు.