డేటింగ్ ఎలా చేయాలో వారసుడికి స్టార్ హీరో సలహా
టాలీవుడ్ లో విలన్ గా నటిస్తూ సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ మీడియాలో హెడ్ లైన్స్ లోకొస్తున్నారు.
By: Tupaki Desk | 27 Sep 2024 9:30 AM GMTటాలీవుడ్ లో విలన్ గా నటిస్తూ సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ మీడియాలో హెడ్ లైన్స్ లోకొస్తున్నారు. ఆదిపురుష్ లో రావణుడి పాత్రలో నటించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరలోను అతడు కీలక పాత్రలో నటించడం ఆసక్తిని కలిగించింది. సైఫ్ తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లోను పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.
ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఇటీవలి ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన ఫ్యామిలీ, పిల్లల గురించి మాట్లాడిన విషయాలు హైలైట్ గా నిలిచాయి. తన పిల్లలు నటులవ్వాలని ఎటువంటి ఒత్తిడి చేయలేదని సైఫ్ అన్నారు. వారికి నచ్చిన విధంగా సంతోషంగా ఉండవచ్చని సైఫ్ స్వేచ్ఛను ఇచ్చానని తెలిపారు. తన వారసులు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ గురించి మాట్లాడాడు వారంతా ఇప్పటికే సినీ పరిశ్రమలో భాగమయ్యారని అన్నారు.
తైమూర్ అలీ ఖాన్ గురించి సైఫ్ ఖాన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ప్రజల ముందు అన్ని నిజాలు చెప్పడానికి నేను భయపడతాను. కానీ ఇప్పుడు థైమూర్ తన పాఠశాలలో ఆటల కోసం ఎదురు చూస్తున్నాడు. తన చిన్న కుమారుడు జెహ్ అలీ ఖాన్ గురించి చెబుతూ..చిన్నవాడు పుట్టుకతోనే మంచి ప్రదర్శనకారుడు..అతడికి ఆ నైపుణ్యం ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. సైఫ్ అలీ ఖాన్ తన పిల్లలతో సమయం గడపడం గురించి కూడా చర్చించారు. ఇబ్రహీం అలీ ఖాన్ ఇటీవల తనను అమ్మాయిల వ్యవహారం గురించి అడిగాడట. అతనికి సమాధానం ఇచ్చే ముందు కొంత ఆలోచించానని సైఫ్ అన్నారు. ``ఒక నిర్దిష్ట దశలో తన సంబంధాన్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలో సైఫ్ కొడుక్కి విశ్లేషణాత్మకంగా చెప్పారట. తన సంబంధాన్ని అన్ని సమయాల్లో సీరియస్‌గా తీసుకోవడం చాలా అవసరమని చెప్పాడు. ఇబ్రహీం తన నటన గురించి.. గాళ్స్ తో సంబంధాల గురించి స్పష్ఠంగా తన తండ్రితో మాట్లాడారు. సారా అలీ ఖాన్ తన వృత్తి గురించి సలహాలు తీసుకుందిట.
ఎన్టీఆర్- సైఫ్ అలీ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం `దేవర: పార్ట్ 1` ఈరోజు 27 సెప్టెంబర్ థియేటర్లలో విడుదలైంది. జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.