Begin typing your search above and press return to search.

సైఫ్ అలీఖాన్ ముగించాల్సిన సినిమాలు ముంగిట‌!

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి క‌త్తిదాడి దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jan 2025 1:30 PM GMT
సైఫ్ అలీఖాన్ ముగించాల్సిన సినిమాలు ముంగిట‌!
X

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడి క‌త్తిదాడి దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. భారీ గాయాల‌తో అసుప‌త్రిలో చేరిన సైఫ్ అలీఖాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అంతా సైఫ్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాల‌ని కోరుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్ అభిమానులు గుళ్ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు కూడా నిర్వ‌హిస్తున్నారు. `దేవ‌ర` సినిమాతో సైఫ్ అలీఖాన్ తెలుగు ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యారు.

ఈ సినిమా రిలీజ్ అనంత‌రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో? తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో బాధ‌ప‌డుతున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ఒక్క‌సారిగా ఆసుప‌త్రి పాల‌వ్వ‌డంతో? అత‌డు పూర్తి చేయాల్సిన సినిమాలు ఎక్క‌డికక్క‌డ ఆగిపోయాయి. సైప్ తిరిగి కోలుకోవ‌డానికి ఎన్ని రోజులు స‌మ‌యం ప‌డుతుంద‌న్ని ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ లు కూడా తాత్కాలికంగా నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది.

హెయిస్ట్ డ్రామా నేప‌థ్యంలో రాబీ గ్రూవెల్ రూపొందిస్తున్న `జ్యూవెల్ దీఫ్ : ది రెడ్ స‌న్ చాప్ట‌ర్` పూర్తి చేయాల్సి ఉంది. అలాగే మార్పిక్స్ బ్యాన‌ర్ పై సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ లోనూ భాగం కావాల్సి ఉంది. ఇంకా `భ‌క్ష‌క్` ఫేం పుల్కిత్ తెర‌కెక్కిస్తున్న క‌ర్త‌వ్య‌లోనూ న‌టించాల్సి ఉంది. అలాగే `రేస్` ప్రాంచైంజీకి కూడా డేట్లు కేటాయించారు. ` రేస్ -4` లో సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఈనేప‌థ్యంలో ఈసినిమా కోసం ఆయ‌న చాలా రోజులు కాల్షీట్లు కేటాయించారు. ఆ సినిమా డేట్ల‌తో మ‌రే సినిమా క్లాష్ కాకుండా, అలాగే త‌దుప‌రి చిత్రాల ప్లానింగ్ కూడా సిద్దం చేసి పెట్టుకున్నారు. కానీ తాజా ప‌రిస్థితుల్లో సైఫ్ అలీఖాన్ ఇప్ప‌ట్లో ఏ సినిమా షూట్ కి హాజ‌ర‌వ్వ‌లేడు. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాజెక్ట్ ల్లో సైఫ్ భాగ‌మ‌వ్వాలంటే పూర్తిగా కోలుకునే వ‌ర‌కూ మేక‌ర్స్ వెయిట్ చేయాలి? లేదా ప్ర‌త్యామ్నాయంగా మ‌రో న‌టుడ్ని తీసుకుని వాటిని పూర్తి చేయాల్సి ఉంది.