స్టార్ కపుల్ 10 ఏళ్ల గ్యాప్ ఉన్నా కానీ...!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడేప్పుడు ఆ ఇద్దరి మధ్యా వయసు అంతరం గురించి చాలా చర్చ సాగింది
By: Tupaki Desk | 17 Oct 2024 9:30 PM GMTపెళ్లి అనగానే వయసు అంతరంపైనా ప్రశ్నలు ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడేప్పుడు ఆ ఇద్దరి మధ్యా వయసు అంతరం గురించి చాలా చర్చ సాగింది. మొదట కరీనా నిర్ణయాన్ని ఇంట్లో వారు సమర్థించలేదని కూడా కథనాలొచ్చాయి. అయినా బెబో కరీనా తాను ప్రేమించిన సీనియర్ హీరో సైఫ్ నే పెళ్లాడింది. ప్రస్తుతం సైఫ్ వయసు 54. కరీనా వయసు 44. వారి మధ్య 10 సంవత్సరాల గ్యాప్ ఉంది.
అదంతా అటుంచితే, వయసు అంతరంతో పని లేకుండా ఈ జంట అన్యోన్య దాంపత్యం నిరంతరం చర్చనీయాంశం. ఒకరికోసం ఒకరు అన్యోన్యంగా జీవించడం పదిమందికి పెళ్లి గోల్స్ నిర్ధేశించడం ఈ జంట ప్రత్యేకత అని నిరూపణ అయింది. తాజాగా సైప్- కరీనా జంట ఈ ఏడాది వివాహ వార్షికోత్సవానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కరీనాను సైఫ్ ముద్దుపెట్టుకున్న సన్నివేశం ఇందులో ఉంది. స్వర్గంలో పెళ్లిళ్లు జరుగుతాయి... నిజమైన ప్రేమికులు స్వర్గధామంలో నివశిస్తారు! అనేందుకు ఇది ఒక సింబల్.
సైఫ్ అలీఖాన్ అభిమానుల సోషల్ మీడియా పేజీలో షేర్ చేసిన ఫోటోలలో అతడు కరీనా కపూర్ ఖాన్ చెంపపై స్వీట్ కిస్ ఇవ్వడం... బెబో ఆనందంతో కెమెరాకు పోజులిచ్చిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. పటౌడీ ప్యాలెస్‌లో ఉన్నప్పటి దృశ్యాలివి. సైఫ్ పచ్చటి గడ్డిపై నిలబడి కెమెరాకు వెనుకవైపున ఉన్న అద్భుతమైన భవనం వైపు చూస్తూ నీలిరంగు టీ - జీన్స్ లో సైఫ్ స్మార్ట్ గా కనిపించాడు. హార్ట్ స్టిక్కర్‌తో కరీనా పోస్ట్‌ను పూర్తి చేసింది. ఈ జంట కుమారుడు తైమూర్ అలీ ఖాన్ రాత్రి సమయంలో ప్యాలెస్ లోపల కొంత వాలీబాల్‌ను ఆస్వాదిస్తున్న దృశ్యాన్ని షేర్ చేసారు. అభిమానులు సోషల్ మీడియాల్లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
కరీనా కపూర్ -సైఫ్ అలీ ఖాన్ ముంబై కోల్బాలోని తాజ్ మహల్ హోటల్‌లో 16 అక్టోబరు 2012న పెళ్లి ప్రమాణం చేసుకున్నారు. 2008లో యష్ రాజ్ ఫిలిమ్స్ తషాన్ చిత్రీకరణ సమయంలో వారి ప్రేమకథ ప్రారంభమైంది. ఈ జంట 2016లో మొదటి కుమారుడు తైమూర్‌కు తల్లిదండ్రులు అయ్యారు. తర్వాత 2021లో వారి రెండవ కుమారుడు జెహ్ జన్మించాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... కరీనా కపూర్ ఖాన్ ఇటీవల హన్సల్ మెహతా `ది బకింగ్‌హామ్ మర్డర్స్`లో కనిపించగా, సైఫ్ అలీ ఖాన్ `దేవర: పార్ట్ 1`లో జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కపూర్‌లతో కలిసి నటించారు.