సైఫ్‌కి 53.. బెబోకి 42.. అయినా కానీ తగ్గేదేలే!
నేను బార్బీ.. ఆమె కెన్‌ని చూస్తున్నాను! అంటూ ఈ జంట పోటోకి స్పందించాడో అభిమాని. కరీనా - సైఫ్ 2012 లో వివాహం చేసుకున్నారు.
By: Tupaki Desk | 16 Aug 2023 4:52 PM GMTఆయనకు 53.. ఆమెకు 42.. అయినా కానీ.. రోమాంచితమైన దినచర్యలో ఎక్కడా తగ్గరు. ప్రకృతి దృశ్యాల నడుమ అందమైన వెకేషన్ ని ఆస్వాధించడానికి మొహమాటపడరు. ఇప్పుడిలా మరోసారి రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. పూల్ సైడ్ రిలాక్స్ అవుతూ ఈ జంట కనిపిస్తున్న తీరు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కరీనాకపూర్ ఖాన్ తన హబ్బీ సైఫ్ అలీ ఖాన్ 53వ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఉద్విగ్నంగా స్పందించింది. తన భర్త గురించి లాంగ్ నోట్ రాసింది. సైఫ్ అలీ ఖాన్ ఈ రోజు ఒక సంవత్సరం పెద్దయాడు అని తెలిపింది.
ఈ పుట్టినరోజు…ఎప్పుడూ ఇలా రిలాక్స్‌గా ఉండండి, నా జాన్...నా అల్టిమేట్ లవర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...నిజంగా మీలాంటి వారు ఎవరూ లేరు...దయ, ఉదారత, వెర్రి...సరే, నేను రోజంతా రాస్తూనే ఉంటాను...కానీ కేక్ తినడానికి వెళ్లాలి'' అంటూ కరీనా తన ప్రేమను కురిపించింది.
అభిమానులు- పరిశ్రమ స్నేహితులు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మలైకా అరోరా, కరిష్మా కపూర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేయగా... సోనమ్ కపూర్, జోయా అక్తర్, అమృత అరోరా 'సైఫు డే' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది అభిమానులు ఈ ప్రేమ జంట 'ఎంతో ఆరాధ్యమైనది' అని వ్యాఖ్యానించారు. నేను బార్బీ.. ఆమె కెన్‌ని చూస్తున్నాను! అంటూ ఈ జంట పోటోకి స్పందించాడో అభిమాని. కరీనా - సైఫ్ 2012 లో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ జంట అభిమానుల్లో కపుల్ గోల్స్‌ను సెట్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇక 50 ప్లస్ లోను సైఫ్ ఎంతో ఎనర్జిటిక్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. నటుడిగా అతడు కెరీర్ లో గొప్ప హైట్స్ ని ఆస్వాధిస్తున్నాడు.