800కోట్ల ప్యాలెస్ ఈ టాలీవుడ్ విలన్ సొంతం
నేడు 100 కోట్ల పారితోషికాలు అందుకుంటున్న హీరోల జాబితా చూస్తే షాకవుతారు. అరడజను పైగా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి
By: Tupaki Desk | 9 Feb 2024 5:30 PM GMTనేడు 100 కోట్ల పారితోషికాలు అందుకుంటున్న హీరోల జాబితా చూస్తే షాకవుతారు. అరడజను పైగా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్, విజయ్ పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. వీరంతా విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఖరీదైన విల్లాలు, లగ్జరీ కార్లు, గడియారాలు, ఇతర విలాసవంతమైన వస్తువులను కలిగి ఉన్న స్టార్లు వీరంతా. షారూఖ్ లాంటి వారికి గల్ఫ్ సహా విదేశాలలో ఆస్తులు ఉన్నాయి. వందల కోట్ల విలువైన భారీ భవనాలలో వీరంతా నివసిస్తున్నారు. అయితే రూ.800 కోట్ల విలువ చేసే భారీ ప్యాలెస్ ఉన్న భారతీయ నటుడు మాత్రం ఒకే ఒక్కరు ఉన్నారు. విదేశాలలోను అతడికి ఆస్తులు ఉన్నాయి. అతడి సంస్థానం ఆస్తులు వేల కోట్లు.
సదరు నటుడు రాజకుటుంబానికి చెందినవాడు, బాలీవుడ్‌లో వరుస హిట్ చిత్రాల్లో నటించాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ అభిమానులను మెప్పించాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో విలన్ గా అందరికీ సుపరిచితుడు. మునుముందు టాలీవుడ్ ని షేక్ చేసే విలన్ గా కనిపించబోతున్నాడు. అతను మరెవరో కాదు ది గ్రేట్ సైఫ్ అలీ ఖాన్.
సైఫ్ అలీ ఖాన్ కి సొంతంగా హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉంది. ఇది పటౌడీ నవాబ్ పూర్వీకుల స్థానం.. ఇది గుర్గావ్ నుండి ఒక గంట ప్రయాణ దూరంలో ఉంది. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్యాలెస్ అంచనా విలువ రూ. 800 కోట్లు. ఇది షారుఖ్ 'మన్నత్' ఖరీదు కంటే చాలా ఎక్కువ. మన్నత్ విలువ రూ. 200 కోట్లు కాగా, అమితాబ్ బచ్చన్ జల్సా మార్కెట్ విలువ దాదాపు రూ. 120 కోట్లు. టాలీవుడ్ లో రామ్ చరణ్ నిర్మించిన ఇల్లు కూడా 100కోట్లు ఉంటుందని ప్రచారమైంది.
ఇంతకీ పటౌడీ సంస్థానంలో ఏమేమి ఉంటాయి? అంటే.. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్‌రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లతో 150 గదులు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు.. సైఫ్ స్విస్ ఆల్ప్స్‌లో కూడా సమయం గడుపుతాడు. అతడు జిస్టాడ్‌లో విలాసవంతమైన చాలెట్‌ని కలిగి ఉన్నాడు. దీని విలువ రూ. 33 కోట్లు. ఈ స్థలంపై తనకున్న ప్రేమ గురించి మాట్లాడుతూ కరీనా కపూర్ ఒకసారి ఇలా చెప్పింది. ''నువ్వు నా తలపై తుపాకీ పట్టుకుని నా చివరి కోరిక కోరితే, నాకు జిస్టాడ్‌లో చివరి సెలవు కావాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన శృంగార ప్రదేశం'' అని తెలిపింది.
అయితే సైఫ్ ఖాన్ ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు సమాచారం. అతడి నికర ఆస్తుల విలువ రూ.1200 కోట్లు. విలాసవంతమైన, ఖరీదైన ఆస్తులే కాకుండా, అతడికి రూ. 3.3 కోట్ల విలువైన గడియారాలను సొంతం చేసుకున్నాడు. ఇందులో దాదాపు రూ. 32,58,000 విలువైన ది పాటెక్ ఫిలిప్స్ నాటిలస్, రూ. 27 లక్షల విలువైన రోలెక్స్ యాచ్‌మాస్టర్ 2, 23లక్షల విలువైన రోలెక్స్ సబ్‌మెరైనర్, రూ. 20 లక్షల ఖరీదైన లాంగే & సోహ్నే..ఉన్నాయి. సైఫ్ సేకరించిన వాటిలో అత్యంత ఖరీదైనది పటేక్ ఫిలిప్ క్రోనోగ్రాఫ్ వార్షిక క్యాలెండర్.. దీని విలువ రూ. 40 లక్షలు.
కెరీర్ పరంగా చూస్తే.. సైఫ్ అలీ ఖాన్ తదుపరి రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో సైఫ్ ఖాన్ కనిపించనున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ విలన్‌గా నటించారు . ఈ ఏడాది ఏప్రిల్‌లో దేవర పార్ట్ 1 ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.