భార్య టాటూని తొలగించిన స్టార్ హీరో
తనకంటే ఎక్కువ వయసు ఉన్న హీరోని పెళ్లాడింది సదరు నటీమణి. ఆ ఇద్దరికీ ఇప్పుడు ఇద్దరు
By: Tupaki Desk | 16 May 2024 6:29 PM GMTతనకంటే ఎక్కువ వయసు ఉన్న హీరోని పెళ్లాడింది సదరు నటీమణి. ఆ ఇద్దరికీ ఇప్పుడు ఇద్దరు. ఈ జంట నడుమ అన్యోన్య దాంపత్యం ఎందరికో స్ఫూర్తి. అయితే ఇప్పుడు తన భార్యపై ప్రేమకు జ్ఞాపకార్థంగా వేయించుకున్న టాట్టూని అతడు తొలగించాడు. మోచేతిపై భార్య పేరును టాట్టూ వేయించుకున్న అతడు ఇప్పుడు దానిని తొలగించడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ ఆదర్శ జంటగా పాపులర్. ఈ జంట 16 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. తైమూర్ అలీ ఖాన్ - జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులకు వారు తల్లిదండ్రులు. చాలా సంవత్సరాల క్రితం ప్రేమాయణంలో ఉన్న సమయంలో కరీనా పేరును తన మోచేతిపై పచ్చబొట్టు వేయించుకుని సైఫ్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఇటీవల విమానాశ్రయంలో చూసినప్పుడు, సైఫ్ మునుపటి పచ్చబొట్టును కవర్ చేస్తూ కొత్త టాటూతో కనిపించాడు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ మధ్య అంతా బాగానే ఉందా? అని కొందరు నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవాన్ని బట్టి చూస్తే... నిన్ననే వీరిద్దరూ తమ ఇంటి వెలుపల ముద్దులు పెట్టుకోవడం మీడియా కంటికి కనిపించింది. కొందరు అభిమానులు సైఫ్ తన సినిమా కోసం టాటూ తొలగించుకున్నాడని అనుకుంటున్నారు. ''అందరినీ చిల్ చేయండి ఇది సినిమా కోసం'' అని మరొకరు అన్నారు. 'విడాకులు పక్కా' అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఈ ప్రపంచంలో మార్పు అనేది అత్యంత స్థిరమైన విషయం! అని మరొకరు వ్యాఖ్యానించారు.