Begin typing your search above and press return to search.

వెంకటేష్ కి ఇది రేర్ ఫీట్ అని చెప్పాలి !

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రిలీజ్ అయిన మూవీ సాంగ్ ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:53 AM GMT
వెంకటేష్ కి ఇది రేర్ ఫీట్ అని చెప్పాలి !
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సైంధవ్. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దీఖ్, తమిళ్ హీరో ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా చేస్తోంది. కంప్లీట్ సీరియస్ నోట్ లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ ఆవిష్కరించారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రిలీజ్ అయిన మూవీ సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఈ సినిమాతో వెంకటేష్ నార్త్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకి 40 కోట్లు వచ్చాయంట. ఇక థీయాట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాలలో 45 కోట్ల వరకు జరిగింది. ఇతర భాషలలో 10 కోట్ల వరకు బిజినెస్ అయ్యింది. ఓవరాల్ గా చూసుకుంటే 95 కోట్ల వ్యాపారం సైంధవ్ సినిమాపై జరిగిందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. మూవీని 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే సినిమాకి పెట్టిన పెట్టుబడి మెజారిటీ రికవరీ అయిపొయింది.

ఇక థీయాట్రికల్ రైట్స్ బోనస్ అని చెప్పాలి. రిలీజ్ కి ముందే నిర్మాత వెంకట్ కి సైంధవ్ మూవీ టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇదే కాగా, హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీ కూడా ఇదే కావడం విశేషమని చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే వెంకటేష్ రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది.

గురు, నారప్ప, దృశ్యం, ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో ఇప్పటికే సక్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉన్న వెంకటేష్ కి సైంధవ్ కూడా మరో సూపర్ హిట్ ని అందిస్తుందని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఘర్షణ తర్వాత ఆ స్థాయిలో ఫుల్ సీరియస్ రోల్ లో ఈ మూవీలో వెంకటేష్ కనిపిస్తున్నారు.