Begin typing your search above and press return to search.

సైంధవ్.. ఇది పోటీ తగునా?

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ సైంధవ్. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది

By:  Tupaki Desk   |   17 Oct 2023 10:30 AM GMT
సైంధవ్.. ఇది పోటీ తగునా?
X

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ సైంధవ్. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. టీజర్ తోనే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. అయితే మూవీకి ఎంత హైప్ ఉన్న కూడా రిలీజ్ అయ్యే సమయం బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా రాంగ్ టైమింగ్ కారణంగా ఫెయిల్ అవుతాయి.

టాలీవుడ్ లో రాంగ్ టైంలో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సైంధవ్ నిర్మాతలు కూడా అలాంటి రాంగ్ టైమింగ్ ని ఎంచుకున్నారు అనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వెంకటేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలబెడుతున్నారు.

ఈ విషయాన్ని తాజాగా టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా డిక్లేర్ చేసేశారు. అయితే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ హనుమాన్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, రవితేజ ఈగల్ సినిమాలు ఉన్నాయి. వీటిలో దేనికవే ప్రత్యేకం అని చెప్పొచ్చు. అన్నిటికంటే గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి.

తరువాత దిల్ రాజు తన ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం సాలిడ్ గా థియేటర్స్ ని ఆక్యుపై చేసే అవకాశం ఉంది. ఈగల్ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కుతోన్న నేపథ్యంలో వీరికి థియేటర్స్ భాగానే దొరుకుతాయి. ఇక రేసులో హనుమాన్ పాన్ ఇండియా మూవీ అయిన కొంత రిస్క్ ఫ్యాక్టర్ పేస్ చేస్తూనే ఉంది. ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉండొచ్చు.

సైంధవ్ మూవీ వెనుక సురేష్ బాబు ఉన్నారు. అయితే సంక్రాంతి రిలీజ్ విషయంలో సురేష్ బాబు నుంచి నిర్మాతలకి క్లారిటీ రాలేదంట. పోటీలో ఎక్కువ సినిమాలు ఉన్న నేపథ్యంలో రిస్క్ అనే విధంగానే ఉన్నారని టాక్. అయితే నిర్మాతలు మాత్రం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతికి రిలీజ్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యారు. డిసెంబర్ లో రావడానికి అవకాశం ఉన్నా ఎందుకనో సంక్రాంతి రేసులోనే పోటీ పడుతున్నారు. మరి ఈ నిర్ణయం సైంధవ్ రిజల్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.