Begin typing your search above and press return to search.

సాయి పల్లవి అక్కడేం చేస్తుంది...?

టాలీవుడ్‌ ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉంది

By:  Tupaki Desk   |   9 Aug 2024 8:33 AM GMT
సాయి పల్లవి అక్కడేం చేస్తుంది...?
X

టాలీవుడ్‌ ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్‌ మీడియా పేజ్ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నట్లుగా పోస్ట్‌ పెట్టడం తో చాలా మంది సాయి పల్లవి ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది అనే చర్చ మొదలు పెట్టారు. సాయి పల్లవి రామాయణం సినిమాలో రణబీర్‌ కపూర్ తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం సినిమాలో సీత పాత్ర లో సాయి పల్లవి నటిస్తున్న నేపథ్యంలో ముంబై అనగానే ఆ సినిమానే అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం ముంబైలో ఉన్నది మాత్రం రామాయణం సినిమా కోసం కాదు. తాను తమిళ సినిమా అమరన్ డబ్బింగ్ కోసం ముంబై వెళ్లినట్లుగా సాయి పల్లవి తెలియజేసింది. రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అమరన్‌ సినిమాలో హీరోగా శివ కార్తికేయన్ నటిస్తుండగా, హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెల్సిందే. వీరి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ హడావుడిగా ఉన్నారు.

అమరన్ సినిమాను అక్టోబర్‌ 31, 2024 న భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ స్పీడ్‌ గా జరుగుతున్నాయి. ఈ నెల చివరి వరకు లేదా సెప్టెంబర్‌ లో సినిమా మొదటి కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయట. సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం తో సినిమాకు మరింత వెయిట్‌ దక్కుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలుగు రాకున్నా కూడా మొదటి సినిమాకే సాయి పల్లవి డబ్బింగ్‌ చెప్పి తన ప్రతిభను చాటుకున్న విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు సాయి పల్లవి తమిళంలో డబ్బింగ్‌ చేప్పడం వల్ల అమరన్‌ కి మరింతగా కలిసి రావడం ఖాయం.

ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్‌ సినిమాలకు తమిళ యూత్‌ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ క్రియేట్‌ అవుతుంది. అమరన్ సినిమాకు కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. తెలుగు లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని సాయి పల్లవి ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు వర్షన్ టైటిల్‌ మరియు ఇతర విషయాల గురించి ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ కచ్చితంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా తెలుగు లో కూడా ఈ సినిమా హిట్‌ అయ్యే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్‌ ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.

సాయి పల్లవి ఇతర సినిమాల విషయానికి వస్తే తెలుగు లో నాగ చైతన్య కు జోడీగా ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఎంతో మంది పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నా కూడా సాయి పల్లవి వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ మంచి కథలు మరియు పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. ముందు ముందు కూడా వరుసగా మంచి పాత్రలతో మీ ముందుకు వస్తాను అన్నట్లుగా ఇటీవల ఒక పోస్ట్‌ లో సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా సాయి పల్లవిని సీత గా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.