బాడీషేమింగ్ గురించి సాయిపల్లవి కామెంట్!
సినిమా..మోడలింగ్ రంగంలో ఇవన్నీ ఎంతో సహజమైనవిగా భావిస్తుంటారు.
By: Tupaki Desk | 4 March 2024 9:30 AM GMTహీరోయిన్ల బాడీషేమింగ్ గురించి నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంటుందో చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ల రూపాన్ని ఉద్దేశించి రకరకాల అంశాలపై హీరోయిన్లు ట్రోలింగ్ కి గురవుతుంటారు. హీరోయిన్లు ఫేస్ సర్జరీలు చేయించుకున్నా? కొవ్వు సంబంధిత సర్జరీలు జరిగినా హీరోయిన్ల రూపంలో వచ్చే మార్పు ల్ని ఉద్దేశించి రకరకాల ట్రోలింగ్..కామెంట్లు తెరపైకి వస్తుంటాయి. వాటిని హీరోయిన్లు అంతే లైట్ తీసు కుంటారు. సినిమా..మోడలింగ్ రంగంలో ఇవన్నీ ఎంతో సహజమైనవిగా భావిస్తుంటారు.
తాజాగా ఈ అంశంపై సాయి పల్లవి కూడా స్పందించింది. `మన చుట్టూ ఉన్న ఆడవాళ్లే బాడీషేమింగ్ ని ఎదుర్కుం టున్నారు తప్ప మగవాళ్లు ఎక్కువగా దాని బారిన పడటం లేదంటే సమస్య ఎక్కడుందో అర్దం చేసుకోవచ్చు. రియాల్టీ షోల్లో పాల్గొన్నప్పుడు..సినిమాల్లోకి వచ్చినప్పుడు తొలి నాళ్లలో నా ముఖంపై మెటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు నన్ను చాలా మంది ఏడిపించారు. నువ్వు నటించడానికి పనికి రావు అనేవారు. `ప్రేమమ్` కి ముందు వరకూ చాలా ఆత్మన్యూనతతో బాధపడేదాన్ని.
చాలా బాధగానూ అనిపించేది. అయినా సరే చాలా మంది మ్యాకప్ వేసుకోమని ఎంత మంది చెప్పినా వినేదాన్ని కాదు. కేవలం నేను వేసే పాత్ర మీద తప్ప మ్యాకప్ మీద ఏనాడు దృష్టి పెట్టలేదు. అందం కంటే ప్రతిభ మాత్రమే గొప్పదని బలంగా నమ్మి ముందుకెళ్లాను. విమర్శలు ఆరంభంలో బాధపెట్టినా తరువాత వాటిని అలవాటుగా మార్చుకున్నాను. అందం కంటే ప్రతిభ గొప్పదని నమ్మడం వల్లే సౌందర్య ఉత్ప త్తుల్ని బ్రాండింగ్ చేయలేదు.
మహిళల కోసం కృషి చేసే ఎన్జీవోల కోసం డబ్బు తీసుకోకుండా ప్రచారం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది` అని అంది. ఈ విషయంలో సాయి పల్లవి చాలా మందిలో స్పూర్తిని నింపుతుంది. మ్యాకప్ వేసుకునే భామల నుంచి సాయి పల్లవిని ఈ క్వాలిటీ వేరు చేస్తుంది. నేచురల్ బ్యూటీతోనే ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ తెలుగులో దేదీప్యమానంగా సాగిపోతుంది. బాలీవుడ్ లో నూ ఇటీవలే ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో ఛాన్స్ అందుకుంది.